సెంచరీతో దుమ్మురేపిన దినేశ్ కార్తీక్
-
91 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 126 పరుగులు
విశాఖపట్నం: దేశీయ క్రికెట్‌లో తమిళనాడు జట్టు మరోసారి దుమ్మురేపింది. 42 పరుగుల తేడాతో ఇండియా బీ జట్టును ఓడించి.. దేవధర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో 2016-17 దేశీయ క్రికెట్ సీజన్‌లో వరుసగా వన్డే ట్రోఫీలను ఆ జట్టు కైవసం చేసుకున్నట్టు అయింది. ఇటీవలే ఆ జట్టు ఫైనల్‌లో బెంగాల్ జట్టును ఓడించి విజయ్ హజారే ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
బుధవారం విశాఖపట్నంలో జరిగిన దేవధర్ ట్రోఫీ ఫైనల్ వన్డే మ్యాచ్‌లో ఇండియా బీ జట్టును తమిళ జట్టు మట్టికరిపించింది. దినేశ్ కార్తీక్ చెలరేగి ఆడి 91 బంతుల్లో (నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో) 126 పరుగులు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 303 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇండియా బీ జట్టు 261 పరుగులకే పరిమితమైంది. తమిళ బౌలర్లు సమిష్టిగా రాణించి.. ప్రత్యర్థిని నిలువరించారు.