సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ చొరబాటుదారులపై కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అంత ప్రేమ ఉంటే వారందరినీ తన అమ్మమ్మ దేశమైన ఇటలీకి తీసుకెళ్లవచ్చని కేంద్ర పశు, మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం రాంచీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి, అస్సాంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. దేశాన్ని కాంగ్రెస్ పార్టీయే మతం ఆధారంగా విభజించిందని విమర్శించారు. ఇప్పడు సీఏఏపై ద్వంద్వ విధానాలు పాటిస్తూ మరోసారి విభజించడానికి కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు.
యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఏఏపై ఆ పార్టీ నాయకులు మాట్లాడిన వీడియోలు ఉన్నాయని, కానీ ఆ పార్టీ ఇప్పుడు ఓట్ల రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం విభజనకు గురైనప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న మైనార్టీలు భవిష్యత్తులో పీడనకు గురైతే భారత్ వారిని సహృదయంతో ఆహ్వానించాలని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ వైఖరిని మంత్రి ఎండగట్టారు. అసద్ 2013లో చేసిన హిందూ ముక్త్ హిందూస్తాన్ వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. చదవండి : సీఏఏ: అసోం మంత్రి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment