Ind Vs Nz 2nd T20 2021: Rohit Sharma Fan Breaches Security And Tries To Touch His Foot During Match - Sakshi
Sakshi News home page

IND Vs NZ 2nd T20 : రోహిత్‌ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే?

Published Sat, Nov 20 2021 8:23 AM | Last Updated on Sat, Nov 20 2021 11:43 AM

Rohit Sharma left stunned as fan fools security - Sakshi

Rohit Sharma left stunned as fan Breaches Security: రాంఛీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో మిడాన్‌లో  ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ వద్దకి వెళ్లిన ఆ అభిమాని అమాంతం పాదాలపై పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని గ్రౌండ్‌ నుంచి బయటకు తీసుకువెళ్లారు.

అయితే ఆటగాళ్ల భద్రతపై పలువురు మాజీలు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా సార్లు అభిమానులు ఇలా మైదానంలో దూసుకొచ్చారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన న్యూజిలాండ్‌ ఆరంభంలో ధాటిగా ఆడిన చివర్లో చేతులు ఎత్తేసింది. గప్టిల్‌(31),డారిల్‌ మిచెల్‌(31), గ్లెన్‌ ఫిలిప్స్‌ (34) రాణించడంతో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్యచేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు.. ఓపెనర్లు రాహుల్‌(65), రోహిత్‌ (55)శర్మ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తరువాత వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ భారత్‌.. పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో భారత్‌ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

చదవండి: IND Vs NZ 2nd T20: రెండో టి20లో విజయం.. టీమిండియాదే సిరీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement