రాంచీ: ఆసియా క్రీడల ద్వారా నేరుగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు... అందుబాటులో ఉన్న రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
రాంచీలో నేటి నుంచి జరిగే మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సవితా పూనియా సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోరీ్నలో టాప్–3లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి.
గ్రూప్ ‘ఎ’లో చిలీ, చెక్ రిపబ్లిక్, జర్మనీ, జపాన్... గ్రూప్ ‘బి’లో భారత్, అమెరికా, న్యూజిలాండ్, ఇటలీ జట్లున్నాయి. నేడు జరిగే తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో అమెరికాతో భారత్; న్యూజిలాండ్‌తో ఇటలీ; చిలీతో జర్మనీ; చెక్ రిపబ్లిక్‌తో జపాన్ తలపడతాయి. భారత్, అమెరికా మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు సుమిత్ అర్హత
టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ అర్హత సాధించాడు. మెల్‌బోర్న్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమిత్ 6–4, 6–4తో ప్రపంచ 118వ ర్యాంకర్ అలెక్స్ మోల్కన్ (స్లొవేకియా)పై నెగ్గాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడం సుమిత్‌కిది రెండోసారి. 2021లోనూ అతను అర్హత సాధించాడు. అలెక్స్‌తో 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సుమిత్ ఐదు ఏస్‌లు సంధించాడు.
తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 22 విన్నర్స్ కొట్టిన సుమిత్ నెట్ వద్ద 12 సార్లు పాయింట్లు గెలిచాడు. ఆదివారం మొదలయ్యే ప్రధాన టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ప్రపంచ 31వ ర్యాంకర్ బుబ్లిక్ (కజకిస్తాన్)తో సుమిత్ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment