
రాంచీ: అందరి అంచనాలు తారుమారు చేస్తూ రాజస్తాన్‌కు చెందిన మహిళా అథ్లెట్ భావన జాట్ 20 కిలోమీటర్ల నడక విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగిన జాతీయ రేస్ వాక్ చాంపియన్‌షిప్‌లో 23 ఏళ్ల భావన... 20 కిలోమీటర్ల దూరాన్ని గంటా 29 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని (1గం:31ని:00 సెకన్లు) అధిగమించింది. ఇంతకుముందు ఢిల్లీకి చెందిన బేబీ సౌమ్య (1గం:31ని:29 సెకన్లు) పేరిట జాతీయ రికార్డు ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment