
రాంచీ స్టేడియంలో నార్త్ బ్లాక్‌కు ‘ఎమ్మెస్ ధోని పెవిలియన్’ అని పేరు పెట్టి జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తమ రాష్ట్ర దిగ్గజం పట్ల గౌరవం ప్రదర్శించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేకు వేదిక అయిన ఈ మైదానంలో బహుశా ధోనికిదే చివరి మ్యాచ్ కావచ్చు.
అయితే సొంత మైదానంలో తన పేరుతో ఉన్న పెవిలియన్‌కు అధికారికంగా ప్రారంభోత్సవం చేసేందుకు ఎంఎస్ ధోని నిరాకరించాడు. ‘మన సొంతిట్లో నేను ప్రారంభోత్సవం చేయడానికి ఏముంటుంది అంటూ’ అతను వినయపూర్వకంగా తిరస్కరించాడని అసోసియేషన్ వెల్లడించింది.
ఇక్కడ చదవండి: ధోనిని పరుగులు పెట్టించాడు..!