న్యూఢిల్లీ: లెఫ్టార్మ్ స్పిన్నర్ షాహబాద్ నదీమ్‌పై టీమిండియా మాజీ సారథి, సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో నదీమ్ అరంగేట్రం చేశాడు. కాగా, ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టి అందరిని అబ్బురపరిచాడు. అయితే, మ్యాచ్ పూర్తయిన తర్వాత నదీమ్ ధోనిని కలిశాడు. వీరిద్దరు రాంచీ క్రికెట్ జట్టులో సభ్యులు కావడం విశేషం. నదీమ్ మీడియాతో మాట్లాడుతూ బౌలింగ్‌లో ఎంతో పరిణితి సాధించావంటూ ధోనీ కొనియాడడని తెలిపాడు.
భుజం నొప్పి కారణంగా కుల్దీప్ యాదవ్ స్థానంలో తనను ఎంపిక చేశారని అన్నాడు. జట్టు మెనేజ్‌మెంట్ పిలుపుతో కేవలం 24గంటల వ్యవదిలోనే కోల్‌కతా నుంచి రాంచీకి బయలుదేరానని అన్నాడు. నా ఆటతీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నానని, ఇదే ఆటతీరును భవిష్యత్తులో కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తన బౌలింగ్ పరిణితి చెందడానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎంతో దోహదపడిందని ధోనీ అభిప్రాయపడ్డాడని నదీమ్ పేర్కొన్నాడు. కాగా, వీరు రాంచీ మైదానంలో ముచ్చటిస్తున్న ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో ఫోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment