Shahbaz Nadeem
-
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్ షాబాజ్ నదీమ్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఇవాళ (మార్చి 5) ప్రకటించాడు. వయసు పైబడటంతో పాటు టీమిండియాకు ఆడే దారులు మూసుకుపోవడంతో తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు నదీమ్ వెల్లడించాడు. మన్ముందు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. 34 ఏళ్ల నదీమ్ 2019-2021 మధ్యలో టీమిండియా తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. జార్ఖండ్ స్టార్ స్పిన్నర్‌గా పేరున్న నదీమ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 140 మ్యాచ్‌లు ఆడి 542 వికెట్లు పడగొట్టాడు. నదీమ్ జార్ఖండ్ తరఫున రంజీల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. నదీమ్‌కు రంజీల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇతను 2015-16, 2016-17 సీజన్లలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. నదీమ్‌కు లిస్ట్-ఏ క్రికెట్లోనూ ఘనమైన రికార్డు ఉంది. నదీమ్ ఈ ఫార్మాట్లో 134 మ్యాచ్‌లు ఆడి 175 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో నదీమ్ పేరిట అత్యుత్తమ గణాంకాల రికార్డు (8/10) నమోదై ఉంది. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన నదీమ్‌కు ఐపీఎల్‌ల్లో కూడా ప్రవేశం ఉంది. నదీమ్.. 2011 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడుతూ వివిధ జట్ల తరఫున 72 మ్యాచ్‌ల్లో 48 వికెట్లు పడగొట్టాడు. నదీమ్ 2022 నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలో సభ్యుడిగా ఉన్నాడు. నదీమ్ 2011లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున అత్యుత్తమంగా రాణించి ఐపీఎల్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. -
నదీమ్‌పై ధోని ప్రశంసలు
న్యూఢిల్లీ: లెఫ్టార్మ్ స్పిన్నర్ షాహబాద్ నదీమ్‌పై టీమిండియా మాజీ సారథి, సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో నదీమ్ అరంగేట్రం చేశాడు. కాగా, ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టి అందరిని అబ్బురపరిచాడు. అయితే, మ్యాచ్ పూర్తయిన తర్వాత నదీమ్ ధోనిని కలిశాడు. వీరిద్దరు రాంచీ క్రికెట్ జట్టులో సభ్యులు కావడం విశేషం. నదీమ్ మీడియాతో మాట్లాడుతూ బౌలింగ్‌లో ఎంతో పరిణితి సాధించావంటూ ధోనీ కొనియాడడని తెలిపాడు. భుజం నొప్పి కారణంగా కుల్దీప్ యాదవ్ స్థానంలో తనను ఎంపిక చేశారని అన్నాడు. జట్టు మెనేజ్మెంట్ పిలుపుతో కేవలం 24గంటల వ్యవదిలోనే కోల్‌కతా నుంచి రాంచీకి బయలుదేరానని అన్నాడు. నా ఆటతీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నానని, ఇదే ఆటతీరును భవిష్యత్తులో కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తన బౌలింగ్ పరిణితి చెందడానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎంతో దోహదపడిందని ధోనీ అభిప్రాయపడ్డాడని నదీమ్ పేర్కొన్నాడు. కాగా, వీరు రాంచీ మైదానంలో ముచ్చటిస్తున్న ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్లో ఫోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. -
15 ఏళ్ల తర్వాత టీమిండియా పిలుపు..
రాంచీ: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన టీమిండియా స్పిన్నర్ షహ్బాజ్ నదీమ్ మొత్తం నాలుగు వికెట్లు సాధించి విజయంలో భాగమయ్యాడు. అయితే తన కెరీర్లో జాతీయ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడుతుండటంపై ఒకింత ఉద్వేగానికి లోనయ్యనట్లు నదీమ్ పేర్కొన్నాడు. ఫీల్డ్‌లో దిగాక ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనైనట్లు తెలిపాడు. సఫారీల రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా మూడో రోజు మ్యాచ్ తర్వాత నదీమ్ మాట్లాడుతూ.. తొలి ఓవర్ ఇబ్బందిగా అనిపించింది. ముఖ్యంగా నేను వేసిన మూడు బంతుల వరకూ నాలో తెలియని భయం ఏర్పడింది. ఆ తర్వాత ఫ్రీగా బౌలింగ్ చేశా. నాకు అనూహ్యంగా భారత జట్టు నుంచి పిలుపు రావడం ఊహించలేదు. నేను చాలాకాలం నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నా. కాకపోతే అనుకోకుండా టీమిండియా మేనేజ్మెంట్ను కాల్ రావడం సంతోషాన్నిచ్చింది. నాకు కాల్ వచ్చిన సమయంలో నేను నమాజ్ చేసుకుంటున్నా. నాకు కాల్ రావడాన్ని గ్రహించా. నేను నమాజ్‌ను పూర్తి చేసుకుని కాల్ లిఫ్ట్ చేశా. శనివారం మ్యాచ్ అయితే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నాకు ఫోన్ కాల్ వచ్చింది. రేపటి మ్యాచ్‌కు సిద్ధం కావాలంటూ ఫోన్ ద్వారా తెలిపారు. నేను కోల్‌కతా నుంచి రోడ్డు మార్గం ద్వారా రాంచీకి బయల్దేరా’ అని నదీమ్ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బావుమాను మెయిడిన్ వికెట్‌గా ఖాతాలో వేసుకున్న నదీమ్.. నోర్జేను రెండో వికెట్‌గా దక్కించుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో చివరి రెండు వికెట్లుగా బ్రుయిన్, ఎన్‌గిడీలను ఔట్ చేసి మ్యాచ్‌కు ఫినిషింగ్ ఇచ్చాడు. 15 ఏళ్ల తర్వాత పిలుపు.. ఫస్ట్‌క్లాస్ అరంగేట్రాన్ని 2004లోనే ఆరంభించిన నదీమ్.. లిస్ట్-ఏ క్రికెట్‌ను 2005లోనే ప్రారంభించాడు.అంతర్జాతీయ అరంగేట్రం కోసం దాదాపు 15 ఏళ్లు నిరీక్షించాడు. ఈ వ్యవధిలో చాలామంది అంతర్జాతీయ అరంగేట్రం చేసినా నదీమ్‌కు మాత్రం అవకాశం రాలేదు. ఎంఎస్ ధోని కలిసి జార్ఖండ్ తరఫున ఆడిన అనుభవం నదీమ్‌ది. ధోని కెరీర్ దాదాపు ముగింపు దశకు వచ్చేసిన సమయంలో నదీమ్‌కు చోటు రావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి విషయం. 2015-16, 2016-17 వరుస రంజీ సీజన్లో 50 వికెట్లుకు పైగా సాధించినా నదీమ్‌కు భారత జట్టు నుంచి పిలుపు రాకపోవడం బాధాకరం. కానీ తన ఆశల్ని వదులు కోలేదు నదీమ్. జాతీయ జట్టులో చోటు కోసం తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్-ఏతో జరిగిన సిరీస్‌లో భాగంగా అనధికారిక తొలి టెస్టులో మొత్తం పది వికెట్లు సాధించాడు. ఆ పర్యటనలో మరో మ్యాచ్‌లో కూడా నదీమ్ రాణించడంతో సెలక్టర్లను ఆకర్షించాడు. అదే సమయంలో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ గాయం కారణంగా వైదొలగడంతో నదీమ్‌కు అవకాశం వచ్చింది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున ఆడిన నదీమ్.. జాతీయ జట్టులో వచ్చిన ఒక చక్కటి అవకాశాన్ని నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. -
నాల్గో భారత బౌలర్‌గా ఘనత
రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్ ద్వారా టీమిండియా జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న స్పిన్నర్ షహ్బాజ్ నదీమ్ అరుదైన జాబితాలో చేరిపోయాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా సోమవారం మూడో రోజు ఆటలో బావుమా(32)ను ఔట్ చేయడం ద్వారా నదీమ్ తొలి అంతర్జాతీయ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. నదీమ్ వేసిన 29 ఓవర్ రెండో బంతిని ముందుకొచ్చి ఆడబోయిన బావుమాను సాహా స్టంప్ ఔట్ చేశాడు. ఫలితంగా స్టంపింగ్ ద్వారా తొలి అంతర్జాతీయ వికెట్‌గా దక్కించుకున్న నాల్గో టీమిండియా బౌలర్‌గా నదీమ్ గుర్తింపు పొందాడు. అంతకుముందు ఈ జాబితాలో డబ్యూవీ రామన్, ఎమ్ వెంకట్రమణ, ఆశిష్ కపూర్లు ఉన్నారు. ఇప్పుడు వారి సరసన నదీమ్ చేరాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎదురీదుతోంది. లంచ్ సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో డుప్లెసిస్(1) ఆరంభంలోనే పెవిలియన్ చేరగా, ఆపై హమ్జా- బావుమాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది. కాగా, ఈ జోడి 91 పరుగులు జత చేసిన తర్వాత హమ్జాను జడేజా బోల్తా కొట్టించాడు. తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న హమ్జాను జడేజా బౌల్డ్ చేశాడు. దాంతో 107 పరుగుల వద్ద సఫారీలు నాల్గో వికెట్‌ను కోల్పోయారు. అదే స్కోరు వద్ద బావుమాను నదీమ్ ఔట్ చేశాడు. మరో 12 పరుగుల వ్యవధిలో హెన్రిచ్ క్లాసెన్(6)ను జడేజా బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా 119 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా కోల్పోయిన ఆరు వికెట్లలో ఉమేశ్ యాదవ్, జడేజాలు తలో రెండు వికెట్లు సాధించగా, షమీ, నదీమ్‌లు చెరో వికెట్ తీశారు. ఇంకా సఫారీలు 368 పరుగుల వెనుకబడ్డారు. -
రాంచీ టెస్టు: అనూహ్యంగా నదీమ్ అరంగేట్రం
రాంచీ: అదృష్టం అంటే ఇదేనేమో. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో చివరి టెస్టులో తలబడబోయే భారత జట్టులో స్పిన్నర్ షాబాద్ నదీమ్ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. అసలు మూడు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో నదీమ్ సభ్యుడు కాదు. అయితే శుక్రవారం ప్రాక్టీస్ సెషన్లో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ గాయపడటంతో ఆగమేఘాల మీద నదీమ్‌ను జట్టులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా రాంచీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇషాంత్ శర్మ స్థానంలో నదీమ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. దీంతో నదీమ్ టెస్టుల్లో అరంగేట్రానికి మార్గం సుగుమమైంది. సారథి విరాట్ కోహ్లి టెస్టు క్యాప్‌ను నదీమ్‌కు అందించాడు. ఇది అంతా కల లేక మాయగా ఉందని నదీమ్ కుటుంబసభ్యులు, అభిమానులు పేర్కొంటున్నారు. ఇలా అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకోవడం క్రికెట్ చాలా అరుదుగా జరుగుతాయి. శనివారం నుంచి ప్రారంభమైన భారత్-సఫారీల తుది టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన సారథి విరాట్ కోహ్లి ఏ మాత్రం ఆలోచించకుండా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంతేకాకుండా జట్టులో ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఇషాంత్‌ను పక్కకు పెట్టి నదీమ్‌ను తీసుకోవడం మినహా పెద్ద మార్పులు జరగలేదు. ఇక టాస్ విషయంలో డుప్లెసిస్‌కు మరోసారి అదృష్టం కలిసిరాలేదు. ముందుగా ప్రకటించనట్టుగానే సారథి డుప్లెసిస్‌తో పాటు బవుమా టాస్ వేయడానికి వచ్చాడు. అయిన్నప్పటికీ సఫారీ జట్టును టాస్ వెక్కిరించింది. దీంతో వరుసగా ఏడు టెస్టుల్లోనూ డుప్లెసిస్ నాయకత్వంలోని సఫారీ జట్టు టాస్ ఓడిపోయింది. ఇక సఫారీ జట్టులోనూ పలు మార్పులు జరిగాయి. ఇక ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఏ మాత్రం ఆలోచించకుండా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఇషాంత్‌ను పక్కకు పెట్టి నదీమ్‌ను తీసుకోవడం మినహా జట్టులో పెద్ద మార్పులు జరగలేదు. ఇక టాస్ విషయంలో డుప్లెసిస్‌కు మరోసారి అదృష్టం కలిసిరాలేదు. ముందుగా ప్రకటించనట్టుగానే సారథి డుప్లెసిస్‌తో పాటు బవుమా టాస్ వేయడానికి వచ్చాడు. అయిన్నప్పటికీ సఫారీ జట్టును టాస్ వెక్కిరించింది. దీంతో వరుసగా ఏడు టెస్టుల్లోనూ డుప్లెసిస్ నాయకత్వంలోని సఫారీ జట్టు టాస్ ఓడిపోయింది. ఇక సఫారీ జట్టులోనూ పలు మార్పులు జరిగాయి. ఈ సిరిస్‌లో వరుస వైఫల్యాలతో విఫలమవుతున్న డిబ్రూయిన్, ముత్తుసామి, ఫిలాండర్, మహరాజ్‌లను సఫారీ జట్టు పక్కుకు పెట్టింది. వీరి స్థానంలో జార్జ్ లిండే, హెన్రిచ్ క్లాసెన్, లుంగిడి ఎన్గిడి, పీట్లను తుది జట్టులోకి తీసుకుంది. అంతేకాకుండా ఈ టెస్టులో డికాక్ ఓపెనర్‌గా వస్తాడని డుప్లెసిస్ ప్రకటించాడు. ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటున్న డుప్లెసిస్ సేన అందకు అనుగుణంగా జట్టు కూర్పులో పెను మార్పులు చేసింది. డికాక్ సేవలను కేవలం బ్యాటింగ్‌కే వాడుకోవాలని భావించి స్పెషలిస్ట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అంతేకాకుండా టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచేవిధంగా అయిదుగురు బౌలర్లతో చివరి టెస్టు బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో సఫారీ స్పిన్నర్ జార్డ్ లిండే టెస్టు అరంగేట్రం చేశాడు. తుది జట్లు భారత్ : కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, రవీంద్ర జడేజా, అశ్విన్, షమీ, ఉమేశ్, నదీమ్ దక్షిణాఫ్రికా : డు ప్లెసిస్ (కెప్టెన్), ఎల్గర్, హమ్జా, హెన్రిచ్ క్లాసెన్, బవుమా, డి కాక్, అన్రిచ్ నార్ట్జే, జార్జ్ లిండే, రబడ, పీట్, ఇన్‌గిడి. -
నదీమ్ వచ్చేశాడు.. మరి ఆడతాడా?
రాంచీ: ఇటీవల వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశేషంగా రాణించిన టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ షహ్బాజ్ నదీమ్.. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టులో భాగంగా భారత జట్టులో చోటు కల్పించారు. గతంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకోలేని నదీమ్ ఎట్టకేలకు టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భుజం నొప్పి గాయంతో బాధపడుతూ ఉండటంతో అతని స్థానంలో నదీమ్ అవకాశం కల్పించారు. తనకు భుజం నొప్పి ఎక్కువగా ఉందని కుల్దీప్ స్పష్టం చేయడంతో నదీమ్‌ను తీసుకున్నారు. ఇప్పటివరకూ భారత సీనియర్ జట్టు తరఫున ఆడని నదీమ్ శనివారం నుంచి ఆరంభం కానున్న టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేయాలని భావిస్తున్నాడు. రేపటి తుది జట్టులో ఇషాంత్ శర్మ స్థానంలో కుల్దీప్ను ఆడించాలనే యోచనలో టీమిండియా యాజమాన్యం ఉంది. రాంచీ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇషాంత్‌ను పక్కకు పెట్టి కుల్దీప్కు చోటు కల్పించాలనుకున్నారు. కాగా, కుల్దీప్ గాయంతో బాధపడుతుండటంతో నదీమ్‌నే తమ మరో స్పిన్ ఆప్షన్‌గా టీమిండియా మేనేజ్మెంట్ ఎంచుకుంది. జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్-ఏతో అనధికారిక సిరీస్‌లో భాగంగా భారత-ఏ జట్టు తరఫున నదీమ్ తన స్పిన్ మ్యాజిక్‌తో ఆకర్షించాడు. తొలి టెస్టులో మొత్తంగా 10 వికెట్లతో మెరిసిన నదీమ్.. మూడో టెస్టులో ఐదు వికెట్లు సాధించాడు. అదే భారత జట్టులో ఎంపికకు మార్గం సుగమం చేసింది. మరి రేపటి నుంచి ఆరంభం కానున్న టెస్టులో ఈ బిహార్ బౌలర్ ఆడతాడో.. లేదో చూడాలి. -
మళ్లీ చెలరేగిన నదీమ్
ట్రినిడాడ్: వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన అనధికారిక మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టులోనూ భారత-ఏ జట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్ షహ్బాజ్ నదీమ్ చెలరేగాడు. తొలి టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో పది వికెట్లు సాధించి సత్తాచాటిన నదీమ్.. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ఆకట్టకున్నాడు. కాగా, మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ నిర్దేశించిన 373 పరుగుల టార్గెట్‌లో భాగంగా విండీస్ ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానకి 314 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. విండీస్ కోల్పోయిన ఆరు వికెట్లలో నదీమ్ ఒక్కడే ఐదు వికెట్లు సాధించడం ఇక్కడ విశేషం. భారత్-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 365/4వద్ద డిక్లేర్ చేసింది. శుబ్‌మన్ గిల్(204 నాటౌట్) డబు్ సెంచరీ సాధించగా, హనుమ విహారి(118) శతకంతో ఆకట్టుకున్నాడు. విండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకు ఆలౌటైంది. చివరి మ్యాచ్ డ్రా ముగియడంతో సిరీస్‌ను భారత్-ఏ జట్టు 2-0తో కైవసం చేసుకుంది.( ఇక్కడ చదవండి: నదీమ్‌కు 10 వికెట్లు!) -
నదీమ్‌కు 10 వికెట్లు!
ఆంటిగ్వా: వెస్టిండీస్-ఏతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత-ఏ లెఫ్మార్మ్ స్పిన్నర్ షహ్బాజ్ నదీమ్ చెలరేగిపోతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన నదీమ్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఐదు వికెట్లు సాధించి విండీస్ పతనాన్ని శాసించాడు. దాంతో విండీస్ యువ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. 159 పరుగుల వరకూ కుదురుగా కనబడిన విండీస్.. ఆపై నదీమ్ స్పిన్‌కు విలవిల్లాడింది. తన స్పిన్ మాయాజలంతో విండీస్‌కు నదీమ్ చెమటలు పట్టించగా, అతనికి జతగా పేసర్ మహ్మద్ సిరాజ్ పదునైన బంతులతో హడలెత్తించాడు. దాంతో విండీస్ 21 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయింది. ఫలితంగా భారత్-ఏ జట్టుకు 97 పరుగుల టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. ఇంకా భారత్ విజయానికి 68 పరుగులు మాత్రమే కావాలి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 312 పరుగులకు ఆలౌట్ కాగా, వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు చాపచుట్టేసింది. నదీమ్ ఐదు వికెట్లు సాధించడంతో విండీస్ రెండొందల మార్కును చేరడానికి ఆపసోపాలు పడింది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌కు రెండు వికెట్లు లభించాయి.