ట్రినిడాడ్: వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన అనధికారిక మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టులోనూ భారత-ఏ జట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్ షహ్‌బాజ్ నదీమ్ చెలరేగాడు. తొలి టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో పది వికెట్లు సాధించి సత్తాచాటిన నదీమ్.. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ఆకట్టకున్నాడు. కాగా, మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ నిర్దేశించిన 373 పరుగుల టార్గెట్‌లో భాగంగా విండీస్ ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానకి 314 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. విండీస్ కోల్పోయిన ఆరు వికెట్లలో నదీమ్ ఒక్కడే ఐదు వికెట్లు సాధించడం ఇక్కడ విశేషం.
భారత్-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 365/4వద్ద డిక్లేర్ చేసింది. శుబ్‌మన్ గిల్(204 నాటౌట్) డబు్ సెంచరీ సాధించగా, హనుమ విహారి(118) శతకంతో ఆకట్టుకున్నాడు. విండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకు ఆలౌటైంది. చివరి మ్యాచ్ డ్రా ముగియడంతో సిరీస్‌ను భారత్-ఏ జట్టు 2-0తో కైవసం చేసుకుంది.( ఇక్కడ చదవండి: నదీమ్‌కు 10 వికెట్లు!)
Comments
Please login to add a commentAdd a comment