IND vs NZ 1st T20I: Crowd erupts with 'Dhoni Dhoni' chants in Ranchi - Sakshi
Sakshi News home page

MS Dhoni: ఏ మాత్రం తగ్గని ధోని ​మేనియా

Published Sat, Jan 28 2023 10:06 AM | Last Updated on Sat, Jan 28 2023 10:32 AM

Crowd chants Dhoni-Dhoni As-His Presence IND Vs NZ 1st T20 Ranchi - Sakshi

టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతనిపై ఉన్న క్రేజ్‌ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. దానికి ఉదాహరణే రాంచీ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టి20. సొంత ఇలాకాలో మ్యాచ్‌ జరగడంతో ధోని తన ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌కు హాజరయ్యాడు. అంతకముందు ఒకరోజే టీమిండియా ఆటగాళ్లను కలిసిన ధోని వారిని సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇక మ్యాచ్‌ సందర్భంగా ధోని స్క్రీన్‌పై కనబడగానే స్టేడియం మొత్తం ధోని.. ధోని అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ధోనీ ధోనీ అంటూ అభిమానులు నిన‌దిస్తుండ‌గా అత‌డు అభివాదం చేశాడు. క్రికెట్లో దిగ్గజ కెప్టెన్‌లలో ఒక‌డిగా పేరు తెచ్చుకున్న ధోనీ రిటైర్మెంట్ త‌ర్వాత ఇత‌ర కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్టాడు. అయితే ఆటకు దూరంగా ఉన్న ఏదో ఒక రూపంలో క్రీడలతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.  ఇటీవలి కాలంలో టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌లకు హాజరవుతున్నాడు.

ఇక శుక్రవారం జ‌రిగిన తొలి టి20లో న్యూజిలాండ్ చేతితో భార‌త్ ఓడిపోయింది. వ‌న్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 లో మాత్రం ఓడిపోవ‌డంతో భారత అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. భార‌త్ ముందు న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించ‌లేక‌ చతికిలపడింది. నిర్ణీత‌ ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. సుందర్‌ ఒక్కడే అర్థశతకంతో ఒంటరిపోరాటం చేశాడు.

చదవండి: ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్‌దీప్‌ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు

స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసిన సుందర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement