ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్ : ఓ 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే దారుణానికి ఒడిగట్టాడు. సోదరి వరుసయ్యే యువతిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసి మరో ఐదుగురితో కలిసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అన్నయ్య స్నేహితుడే కదా! అని నమ్మిన ఆ యువతికి తీరని శోకాన్ని మిగిల్చాడు. రెండు రోజుల పాటు ఓ గదిలో బంధించి నరకం చూపించారు. మృగాళ్లలా ఆ యువతిని అతికిరాతకంగా చెరచటంతో బాధితురాలు ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తమ వాంఛను తీర్చుకున్న దుండగులు బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. జార్ఖండ్‌లోని చక్రదాపుర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
ఒడిశా రూర్కెలాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని గత డిసెంబర్ 30న ఇంటికెళ్లడానికి రైల్వే స్టేషన్‌లో వేచి ఉంది. ఈ క్రమంలో ఆ యువతి దగ్గరకు వచ్చిన ఆమె అన్నయ్య స్నేహితుడు ఆమెను నమ్మించి తప్పుడు ట్రైన్ ఎక్కించాడు. రైలు ఎక్కాక తాను సరైన ట్రైన్ ఎక్కలేదనే విషయాన్ని గ్రహించిన ఆమె.. నిలదీయడంతో జార్ఖండ్ లోథపుర్ స్టేషన్‌లో దిగుదామని, అక్కడి నుంచి బస్సులుంటాయని నమ్మించాడు. ముందే ప్లాన్ చేసిన నిందితులు యువతిని బలవంతంగా లోథ్‌పుర్‌లోని ఓ ఇంటిని తీసుకెళ్లి రెండు రోజుల పాటు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయడంతో బాధితురాలు స్థానికులు సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ గ్యాంగ్ రేప్ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఘటనపై రూర్కెలా ఎస్పీ మాట్లాడుతూ.. ఇంత వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని, బాధితురాలు ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment