
బస్సు గిరిఢీ నుంచి హజారీబాగ్ వెళ్తున్న సమయంలో తాతిఝరియా వద్ద అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి సివేనీ నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు
రాంచీ: జార్ఖండ్ హజారీబాగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు బస్సులోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
బస్సు గిరిఢీ నుంచి హజారీబాగ్ వెళ్తున్న సమయంలో తాతిఝరియా వద్ద అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి సివేనీ నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వీరి సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
చదవండి: నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి..