Hazaribagh
-
బీజేపీకి నో చెప్పా... ఈడీ వచ్చింది: జార్ఖండ్ ఎమ్మెల్యే
రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తున్నాయి. చివరి నిమిషంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారేవారికి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితాల్లో చోటు దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపపథ్యంలో జార్ఖండ్‌లోని బర్కాగాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందని ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినందుకే తన నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో అర్ధరాత్రి దాడులు చేస్తోందన్నారు. VIDEO | ED raids to break morale ahead of LS polls: Congress MLA Amba Prasad's mother READ: https://t.co/J7UeiSbEIC "I was offered an MP ticket from the BJP for Hazaribagh, which I declined. Some people from the BJP side pressurised me to contest from the side of BJP MP Chatra.… pic.twitter.com/rDocABkLvp — Press Trust of India (@PTI_News) March 12, 2024 ‘నాకు బీజేపీ హజారీబాగ్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. కొందరు బీజేపీ నేతలు నన్ను ఛాత్రా నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు. ఈ ఆఫర్లను నేను తిరస్కరించాను. దీంతో ఈడీని రంగంలోకి దించి నాపై దాడులు చేయిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ఎమ్మెల్యే మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అంబ ప్రసాద్‌కు సంబంధించిన 17 ప్రదేశాల్లో ఈడీ మంగళవారం అర్ధరాత్రి సోదాలు ప్రారంభించింది. జార్ఖండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా ఉన్న అంబ ప్రసాద్ మాజీ మంత్రి యోగేంద్ర సా కుమార్తె. హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అంబప్రసాద్ కుటుంబానికి గట్టి పట్టుండటం గమనార్హం. #WATCH | Ranchi, Jharkhand: The Enforcement Directorate (ED) leaves after conducting raids on the premises of Congress MLA Amba Prasad for almost 18 hours. pic.twitter.com/2vrhhMimsW — ANI (@ANI) March 12, 2024 ఇదీ చదవండి.. పోలీసుల బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్‌స్టర్, రివాల్వర్ రాణి -
59th Raising Day : పాక్, బంగ్లా సరిహద్దుల్లో పటిష్ట భద్రత
హజారీబాగ్: భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించబోతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో సరిహద్దులను దుర్భేద్యంగా మార్చబోతున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో అసంపూర్తిగా ఉన్న 60 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శుక్రవారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) 59వ రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. జవాన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదేళ్లలో భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ సరిహద్దుల్లో 560 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన కంచెలో అక్కడక్కడా ఖాళీలు ఉండేవని, ఆ ఖాళీల గుండా చొరబాటుదారులు, స్మగ్లర్లు సులభంగా మన దేశంలోకి ప్రవేశించేవారని గుర్తుచేశారు. ఆ ఖాళీల్లోనూ కంచె నిర్మాణం పూర్తయ్యిందని, తూర్పు, పశి్చమ సరిహద్దుల్లో మరో 60 కిలోమీటర్లే కంచె ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. -
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు
రాంచీ: జార్ఖండ్ హజారీబాగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు బస్సులోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బస్సు గిరిఢీ నుంచి హజారీబాగ్ వెళ్తున్న సమయంలో తాతిఝరియా వద్ద అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి సివేనీ నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వీరి సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చదవండి: నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి.. -
ఇది పోలింగ్ బూతే
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అత్యంత కష్టతరమైన పని. అందులోనూ అత్యంత వెనుకబడిన, కనీస రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అతి కష్టం. అలాంటి కోవలోదే జార్ఖండ్‌లోని హజారీబాగ్. హజారీబాగ్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆదివాసీలతో ఓట్లు వేయించేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ముçప్పుతిప్పలు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు వారు. అభివృద్ధి వారి గూడేల్లోకి అడుగిడే పరిస్థితులే లేవు సరికదా జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మావోయి స్టుల ప్రాబల్యం ప్రబలంగా ఉంది. ఎలాగైనా పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎన్నికల నిర్వాహకులు. కొండకోనల్లో ఉండే గిరిజనులను రప్పించేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశారు. గతంలో స్థానిక ఆదివాసీ ప్రజల్లో అత్యధిక మంది రైలు ఎక్కడం కాదు కనీసం చూడను కూడా చూసి ఉండర ని తెలిసుకున్నారు. అంతే రైలు బోగీ ఆకారంలో పోలింగ్ బూత్‌ని ఏర్పాటు చేసి, దానికి 140 నంబర్ ఇచ్చారు. దానికి తోడు రైలు బూత్ గురించి గిరిజన గూడేల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల అధికారులు ఊహించినట్టుగానే నిజమైన రైలుని చూడని ఆదివాసీలు రైలు బూత్‌ని చూడ్డం కోసం వచ్చి, ఎంచక్కా రైలెక్కి తమ ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళిపోయారు. టికెట్టు లేకుండా రైలెక్కినట్టూ అయ్యింది. అధికారులకు ఆశించిన ఓటుని వినియోగించుకోవడమూ జరిగింది. బూత్‌నంబర్ 140 జార్ఖండ్‌లోని హజారీబాగ్ నియోజకవర్గం పరిధిలోని రామ్‌గఢ్ బ్లాక్లోనిది. -
రోడ్డుప్రమాదాల్లో ఆరుగురి మృతి
రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. బస్సు, ట్రాక్టర్లు ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన హజారీబాగ్‌లో శనివారం ఉదయం జరిగింది. బస్సు బిహార్‌లోని గయా నుంచి జెంషెడ్పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు రాంచీలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఇద్దరు యువకులు బైక్ పై వెళుతుండగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
హార్వర్డ్ నుంచి కేంద్ర కేబినెట్ దాకా....
తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైన బీజేపీ ఎంపీ జయంత్ సిన్హాను కేంద్ర మంత్రి వరించింది. 2014 ఎన్నికల్లో జార్ఖండ్ లోని హజారీబాగ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా కుమారుడైన జయంత్- పార్లమెంట్ నియమించిన రెండు కీలక కమిటీల్లోనూ సభ్యుడిగా ఉన్నారు. వాజపేయి హయాంలో తన తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జయంత్ రాజకీయ జీవితం ప్రారంభించారు. అనేక పథకాల రూపకల్పనలో తనవంతు సాయం అందించారు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు పూర్తి పేరు: జయంత్ సిన్హా జన్మదినం:1963 ఏప్రిల్ 21 జన్మస్థలం: గిరిదిహ్(జార్ఖండ్) వయసు: 51 తల్లిదండ్రులు: యశ్వంత్ సిన్హా, నీలిమా సిన్హా భార్య: పునీత కుమార్ సిన్హా పిల్లలు: కుమార్తె, కుమారుడు విద్యార్హత: ఐఐటీ(ఢిల్లీ), ఏంబీఏ(హార్వర్డ్ బిజినెస్ స్కూల్) పార్టీ: బీజేపీ రాష్ట్రం: జార్ఖండ్ నివాసం: హజారీబాగ్, ఢిల్లీ రాజకీయ జీవితం 1998-2002లో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు సహకారం 2014లో హజారీబాగ్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక పార్లమెంట్ రెండు కమిటీల్లో సభ్యుడిగా నియామకం 2014 నంబర్ 9న కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం -
యశ్వంత్ సిన్హాకు జ్యుడీషియల్ కస్టడీ
హజారీబాగ్(జార్ఖండ్): బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హాను హజారీబాగ్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రభుత్వాధికారిపై దాడి కేసులో ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. హజారీబాగ్ విభాగం విద్యుత్ శాఖ జనరల్ మేనేజర్ ధనేష్ ఝాపై దాడి చేసినందుకు యశ్వంత్ సిన్హా, 300 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ధనేష్ పై దాడి చేయాలని తానే మహిళా కార్యకర్తలకు పిలుపునిచ్చినట్టు మీడియా ముందు సిన్హా అంగీకరించారు. కరెంట్ కోతలతో ప్రజలను అధికారులు కష్టాలు పెడుతున్నందుకే వారిపై దాడి చేయించినట్టు చెప్పారు.