రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. బస్సు, ట్రాక్టర్‌లు ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన హజారీబాగ్లో శనివారం ఉదయం జరిగింది. బస్సు బిహార్‌లోని గయా నుంచి జెంషెడ్‌పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరో వైపు రాంచీలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఇద్దరు యువకులు బైక్ పై వెళుతుండగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రోడ్డుప్రమాదాల్లో ఆరుగురి మృతి
Published Sat, Oct 8 2016 12:00 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement