హార్వర్డ్ నుంచి కేంద్ర కేబినెట్ దాకా....
తొలిసారిగా లోక్సభకు ఎన్నికైన బీజేపీ ఎంపీ జయంత్ సిన్హాను కేంద్ర మంత్రి వరించింది. 2014 ఎన్నికల్లో జార్ఖండ్ లోని హజారీబాగ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా కుమారుడైన జయంత్- పార్లమెంట్ నియమించిన రెండు కీలక కమిటీల్లోనూ సభ్యుడిగా ఉన్నారు. వాజపేయి హయాంలో తన తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జయంత్ రాజకీయ జీవితం ప్రారంభించారు. అనేక పథకాల రూపకల్పనలో తనవంతు సాయం అందించారు.
వ్యక్తిగత, కుటుంబ వివరాలు
పూర్తి పేరు: జయంత్ సిన్హా
జన్మదినం:1963 ఏప్రిల్ 21
జన్మస్థలం: గిరిదిహ్(జార్ఖండ్)
వయసు: 51
తల్లిదండ్రులు: యశ్వంత్ సిన్హా, నీలిమా సిన్హా
భార్య: పునీత కుమార్ సిన్హా
పిల్లలు: కుమార్తె, కుమారుడు
విద్యార్హత: ఐఐటీ(ఢిల్లీ), ఏంబీఏ(హార్వర్డ్ బిజినెస్ స్కూల్)
పార్టీ: బీజేపీ
రాష్ట్రం: జార్ఖండ్
నివాసం: హజారీబాగ్, ఢిల్లీ
రాజకీయ జీవితం
1998-2002లో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు సహకారం
2014లో హజారీబాగ్ నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నిక
పార్లమెంట్ రెండు కమిటీల్లో సభ్యుడిగా నియామకం
2014 నంబర్ 9న కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం