జార్ఖండ్ : లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు సోమవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులుతీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా వృద్ధులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
జార్ఖండ్‌లోని హజారిబాగ్‌లో ఓ వ్యక్తి తన 105 సంవత్సరాల తల్లిని ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమె ఉత్సాహంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. బిహార్, జమ్ము కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐదో విడత పోలింగ్ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment