రాంచీ: జార్ఖండ్‌కు చెందిన ఈ తోబుట్టువులిద్దరు డాన్స్ వీడియోలతో టిక్‌టాక్‌లో ఇప్పటికే మిలియన్ మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరు ట్విట్టర్లో కూడా ట్రెండ్ అవుతున్నారు. సనాతన్ కుమార్ మహాతో, అతని సోదరి టిక్‌టాక్ వీడియోలతో ఎందరినో అలరిస్తున్నారు. ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఇంటి బయట నిల్చుని చేసే వీరి డాన్స్‌కు నెటిజనులు ఫిదా అవుతున్నారు. తమ ప్రతిభ, స్వయం కృషితో వీరు జనాల హృదయాలను గెలుచుకోగలిగారు. వీరి వీడియోలు ఇప్పుడు ట్విట్టర్‌లోను ట్రెండ్ అవుతున్నాయి. వీరి ప్రతిభను ప్రశంసించే వారిలో టీవీ హోస్ట్ మినీ మాథుర్ కూడా ఉన్నారు. ‘ఈ రోజు ఉదయం నేను చూడవలసినది ఇదే !! 2020లో సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ చాలా ప్రేమ’ అని ట్వీట్ చేశారు.
Yes! This is what I needed to see this morning!! So much love to everyone who is trying to stay positive through 2020. https://t.co/dhbEoDGh6Z
— Mini Mathur (@minimathur) June 1, 2020
Comments
Please login to add a commentAdd a comment