"పోయే.. పోయే.. టిక్‌టాక్ పోయే..." అంటూ కొందరు నవ్వుతూ, మరికొందరు ఏడుపుముఖంతో టిక్‌టాక్‌కు వీడ్కోలు చెబుతున్నారు. ఎంత కష్టపడి వీడియోలు చేసినా ఒక్క లైకూ ఇవ్వనందుకు టిక్‌టాక్‌కు తగిన శాస్తి జరిగిందని ఆఖరికి టిక్‌టాక్ యూజర్లు కూడా శాపనార్థాలు పెడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టిక్‌టాక్‌లో సెలబ్రిటీలకు డూప్‌లు కూడా ప్రత్యక్షం కాగా వారు పాపులారిటీ సంపాదించుకున్నారు. చిన్నపాటి వీడియోలు చేస్తూ లైకులతో మురిసిపోయేవారు. కానీ యాప్ బ్యాన్‌తో వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
Happy with the step our government had taken....people wonder what they can do for their country? I'd say every bit counts, this is a good start.#DELETE #ChineseAppsBlocked pic.twitter.com/0iHMGz1yR2
— Karanvir Bohra (@KVBohra) June 29, 2020
అటు సెలబ్రిటీలు కూడా ప్రమోషన్లు చేసుకునేందుకు ఈ యాప్‌ను విచ్చలవిడిగా వాడుకున్నారు. అయితే టిక్‌టాక్‌తో సహా 58 యాప్‌లపై ప్రభుత్వం నిషేధించడాన్ని వీరు స్వాగతిస్తున్నారు. నటి నియాశర్మ స్పందిస్తూ "ఈ దేశాన్ని రక్షించినందుకు ధన్యవాదాలు. టిక్‌టాక్ అనే వైరస్‌ను ఇంకెప్పటికీ అనుమతించకండి" అని కోరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని ఇచ్చిందని నటుడు కరన్‌వీర్ బోరా పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తన టిక్‌టాక్ అకౌంట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు)
#RIPTiktok
— 🇮🇳 HINDUSTAN MERI JAAN 🇮🇳 (@prabinking) June 30, 2020
RT If you happy after #tiktokbaninindia 😂😂😂👍🏻👍🏻 pic.twitter.com/i1er2bH8Pc
ఇవన్నీ పక్కన పెడితే టిక్‌టాక్ బ్యాన్‌తో దేశానికి పట్టిన పీడ విరగడైపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో "#RIPTiktok" ట్రెండింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఫన్నీ మీమ్స్, సరదా కామెంట్లతో నెట్టింట జోకులు పేలుతున్నాయి. (చైనాకు షాకిచ్చిన భారత్)
#RIPTiktok
— Shivam yadav (@Shivamy93527382) June 30, 2020
Two minutes silence for them plss 😂🙏 pic.twitter.com/VUAaRkn3IW
దీంతో సోషల్ మీడియాలో ఓ రకమైన పండగ వాతావరణమే కనిపిస్తోంది. టిక్‌టాక్‌తో ఫేమస్ అయి, ఒక్క వీడియో పోస్ట్ చేస్తే చాలు లక్షల లైకులు వచ్చిపడే టిక్‌టాకర్లకు నెటిజన్లు రెండు నిమిషాల మౌనం పాటిస్తున్నారు.
Meme material of the year 😅😅🤣
— Prakash Thakur (@Prakash34573571) June 30, 2020
Kothe p raid pad gyii 🤣#RIPTiktok pic.twitter.com/f99c8Pxffn
జోకర్ సినిమాలో నటుడికి టిక్‌టాక్‌లో ఎంతోమంది డూప్‌లు ఉన్నారు. పనిలో పనిగా వారికి కూడా రిప్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక టిక్‌టాక్ శవపేటికను మోస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. టిక్‌టాక్ తొలగింపుతో అందరికంటే ఎక్కువగా సంతోషంగా ఉండేది యూట్యూబర్ క్యారీమినటి అంటూ మరో ఫొటో కూడా నవ్వు తెప్పిస్తోంది.
Meanwhile memers Abe hamara bhi hath hai #RIPTiktok pic.twitter.com/WdlHYiWsU4
— Bikram Singh (@BikramS97264319) June 30, 2020
అప్పుడే టిక్‌టాక్‌కు సమాధి కట్టేసి పూలదండలు కూడా వేస్తున్నారు. 'చైనాకు దెబ్బ, టిక్‌టాకర్ల అబ్బ' అంటూ కామెంట్లు పెడుతున్నారు
#RIPtiktok with 58 Others 😀😀 pic.twitter.com/JfjCo4MWOh
— 💞__𝐒𝐨𝐟𝐭𝐰𝐚𝐫𝐞__🎭 (@mr__bspatel) June 29, 2020
Tiktok got banned by government of india
— Sneha ♥️Solo Sidheart♥️ (@Real_sneha_) June 30, 2020
Tiktokers right now -#RIPTiktok pic.twitter.com/FAexCWYe3Q
THE END..!#RIPTiktok
— ವನಿತ ಲಕ್ಷ್ಮಣ್ ಗೌಡ (@gulikenne_12) June 30, 2020
Picture source: twitter / internet pic.twitter.com/VBJNxksrW2
Comments
Please login to add a commentAdd a comment