ట్విటర్‌లో కొన్ని వీడియోలు ఆకట్టుకోవచ్చు..మరికొన్ని వీడియోలు ఆలోచింపచేయవచ్చు..కానీ నడివీధిలో ఇద్దరు నడివయసు దాటిన మహిళలు చేసిన డ్యాన్స్ మాత్రం ఇట్టే ఆకట్టుకుంటోంది. పీచేతోదేఖో పేరుతో ఉన్న ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన 15 సెకన్ల క్లిప్ ప్రస్తుతం ట్విటర్‌ను ఊపేస్తోంది. 1971లో ఆశా భోస్లే హిట్ సాంగ్ పియతూ అబ్ తో ఆజా అనే పాటకు ఇద్దరు మహిళలు రోడ్డుపై లయబద్ధంగా చేసిన డ్యాన్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వారిద్దరూ మతిపోయే స్టెప్పులతో గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో అదరగొట్టడాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. ఎక్కడా ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా వారు చేసిన డ్యాన్స్ చూపరులను అలరించింది.
జితేంద్ర, ఆశాపరేఖ్ జంటగా తెరకెక్కిన కారవాన్ మూవీలోని ఈ పాటను ఆర్‌డీ బర్మన్ కంపోజ్ చేశారు. మహిళల డ్యాన్స్‌కు ఫిదా అయిన ట్విటర్ యూజర్లు కామెంట్స్‌లో వారిని ప్రశంసల్లో ముంచెత్తారు. బహుత్ మస్త్.. తమ హృదయం సంతోషంతో నిండిపోయిందని.. డబ్బుతో సంతోషం కొనలేమని అంటూ కామెంట్లు చేశారు. మహిళల డ్యాన్స్ వీడియోను ఇప్పటివరకూ 3000 మంది వరకూ వీక్షించగా పెద్దసంఖ్యలో లైకులు వచ్చాయి. పలువురు నెటిజన్లు రీట్విట్ చేశారు. చదవండి : కృష్ణంరాజు చేపల పులుసు
This is so cute☺️ pic.twitter.com/xDslL51Ob0
— Pathan ka Baccha (@peechetodekho) August 29, 2020
Comments
Please login to add a commentAdd a comment