సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత వల్లే ఓటమిపాలైందని భావిస్తున్నట్లు తెలిపారాయన. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ..
కర్ణాటక ఫలితాలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ వ్యతిరేకతకు బహుశా అక్కడి ఎమ్మెల్యేల పని తీరు కూడా కొంత కారణం కావొచ్చు. నరేంద్ర మోదీపై అక్కడి ప్రజలకు అభిమానం ఉన్నప్పటికీ.. ఫలితాలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా వచ్చాయి. కానీ, పార్లమెంట ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుస్తామని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
కర్ణాటకలో మాదిరే తెలంగాణలోనూ ఇక్కడి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉంది. ఇక్కడ ప్రతిపక్షంగా మేం ప్రభుత్వ నిరంకుశ పాలనను, పనితీరును ఎండగడుతున్నాం. కాబట్టి, తెలంగాణలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాం అని తెలిపారాయన.
ఇదీ చదవండి: కాంగ్రెస్ విక్టరీ.. సంక్షేమ హామీలు పని చేశాయి
Comments
Please login to add a commentAdd a comment