జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లా సలాల్ హైమనా ప్రాంతంలో లభ్యమైన 59 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలను ఈ ఏడాది డిసెంబర్ నుంచి వేలం వేయనున్నట్లు గనుల మంత్రిత్వ శాఖ సెక్రటరీ వివేక్ భరద్వాజ్ తెలిపారు.
ఇటీవల గనుల శాఖకు సంబంధించిన ఓ కార్యక్రమంలో వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. లిథియం వేలంలో సలహాదారు కోసం కేంద్ర గనుల శాఖ జమ్మూ కశ్మీర్ పరిపాలనా విభాగానికి లేఖ రాసినట్లు తెలిపారు. త్వరలో ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ..59 లక్షల టన్నుల లిథియంను కనుగొనడం అదృష్టంగా భావిస్తున్నాం. వాస్తవానికి మేం జమ్మూ కాశ్మీర్‌లో లభించే సున్నపురాయి కోసం అన్వేషించాం. ఇందులో భాగంగా సున్నపురాయి, బాక్సైట్, లిథియంలను గుర్తించినట్లు చెప్పారు.
రూ.35 లక్షల కోట్లకు పైమాటే
ఈ ఏడాది ప్రారంభంలో జమ్మూకశ్మీర్‌లో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. మార్కెట్ అంచనా ప్రకారం.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తించిన ఒక టన్ను లిథియం ఖరీదు రూ. 60 లక్షలు ఉండగా.. వీటి మొత్తం ఖరీదు సుమారు రూ. 35 లక్షల (అంచనా) కోట్లుపై మాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇదే లిథియం నిక్షేపాల్ని వేలం వేసేందుకు కేంద్రం సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment