
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ-ఎన్‌ఆర్సీ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూ ప్రకంపనలు 3.5గా నమోదు అయ్యాయి. భూ ప్రకంపనలతో జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment