నేపాల్ను వణికించిన భూకంపం
ఖట్మండ్: నేపాల్ను శనివారం భూకంపం వణికించింది. భూప్రకంపనలతో నేపాల్లో భవనాలు, నివాస సముదాయాలు కుప్పకూలాయి. రాజధాని ఖట్మాండ్తో సహా ప్రాంతాల్లో భూకంపం బీభత్సం సృష్టించింది. నేపాల్ కేంద్రంగా ఖట్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. నేపాల్ లాంజంగ్ ప్రాంతంలో భూప్రకంపనలు అధికంగా నమోదు అయ్యాయి.
మరోవైపు భూ ప్రకంపనల ధాటికి ఖాట్మండు విమానాశ్రయాన్ని మూసివేశారు. దుమ్ముధూళితో ఖాట్మాండ్ నిండిపోయింది. అలాగే నేపాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. టెలికమ్ సేవలు నిలిచిపోయాయి. కాగా నేపాల్లో ఇప్పటివరకూ ఒకరు మృతి చెందినట్లు సమాచారం. భూకంప తీవ్రతతో పురాతన భవనం కూలి ఆ వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు నేపాల్ సరిహద్దు రాష్ట్రాల్లో భూకంప ప్రభావం తీవ్రమని అధికారులు అంచనా వేస్తున్నారు.