ఒకే ప్రాంతంలో మూడుసార్లు భూకంపం | Earthquake tremors with magnitude 4.6 felt in himachal Pradesh | Sakshi
Sakshi News home page

ఒకే ప్రాంతంలో మూడుసార్లు భూకంపం

Published Sat, Aug 27 2016 7:19 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

Earthquake tremors with magnitude 4.6 felt in himachal Pradesh

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్లో ఒకే ప్రాంతంలో ఒకే రోజున మూడు సార్లు భూమి కంపించింది. కుల్లు జిల్లాలో శనివారం ఉదయం 6.45 ప్రాంతంలో తొలుత స్వల్పంగా భూమి కంపించిన కొన్ని గంటలకూ అదే ప్రాంతంలో మరో రెండుసార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

తొలిసారి భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.6 గా నమోదు కాగా, రెండోసారి ఉదయం 7.05 గంటల ప్రాంతంలో 4.3గానూ, మూడోసారి 9.08 గంటల ప్రాంతంలో 4.2 గా నమోదు అయినట్టు స్థానిక వాతావరణ కార్యాలయ డైరెక్టర్‌ మన్మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కుల్లు పరిసర ప్రాంతాల్లో వరుసగా భూమి పలుమార్లు కంపించడంతో అక్కడి ప్రాంత ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement