Geological Survey
-
తైవాన్‌లో తీవ్ర భూకంపం
తైపీ: ద్వీప దేశం తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్‌ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు. జపాన్, చైనాలోనూ ప్రకంపనలు జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్‌ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది. భూ విలయాల గడ్డ తైవాన్ కంప్యూటర్ చిప్‌ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్‌లో ఉంది. -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం
ఫిలిప్పీన్స్ మరోసారి భారీ భూకంపంతో కంపించి పోయింది. శుక్రవారం దక్షిణ ఫిలిప్పిన్స్ మిందానో ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని జర్మనీ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అయితే, పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని, భూకంప నష్టంపై తక్షణ సమాచారం ఏదీ లేదని ప్రకటించింది. అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ సూచించింది. తాను ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇదే బలమైన భూకంపం అని షియా లేరాన్ తెలిపారు. దీంతో జనం భయాందోళనలతో పరుగులు తీశారని చెప్పారు. భూకంప కేంద్రం నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దావో సిటీలో జరిగే సమావేశానికి ఆమె హాజరుకానున్నారు. అలాగే బలమైన భూకంపంతో గోడలు దెబ్బతిన్నాయని, కంప్యూటర్లు కింద పడిపోయాయని దక్షిణ కోటాబాటోలోని జనరల్ శాంటోస్ నగరానికి చెందిన రేడియో అనౌన్సర్ లెనీ అరనెగో తెలిపారు. జనరల్ శాంటాస్ సిటీ విమానాశ్రయంలోని ప్రయాణికులను టార్మాక్‌కు తరలించారని భూకంపం సంభవించినప్పుడు విమాన ప్రయాణికుడు మైఖేల్ రికాఫోర్ట్ తెలిపారు. జపాన్ నుండి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కేంద్రం "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తూంటాయి. దీంతోపాటు గత వారం పది రోజుల్లో పలు దేశాల్లో భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. 🧵 Video and images emerging after a M6.7 earthquake struck Mindanao in the #Philippines. Terrifying 😳 pic.twitter.com/KkKVLU53vt — Volcaholic 🌋 (@volcaholic1) November 17, 2023 🧵 Video and images emerging after a M6.7 earthquake struck Mindanao in the #Philippines. Terrifying 😳 pic.twitter.com/KkKVLU53vt — Volcaholic 🌋 (@volcaholic1) November 17, 2023 -
ఇండోనేసియా భూకంపంలో ఏడుగురు మృతి
పసమన్ (ఇండోనేషియా): ఇండోనేసియా సుమత్రా దీవుల్ని శుక్రవారం భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 85 మంది గాయపడ్డారు. 5 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. మలేసియా, సింగపూర్‌లో భూ ప్రకంపనలు ప్రజల్ని భయపెట్టాయి. పశ్చిమ సుమ త్రా ప్రావిన్స్‌లోని బుకిటింగి పట్టణం భూకం ప కేంద్రంగా ఉంది. భూ ఉపరితలానికి 12 కిలోమీటర్ల దిగువన భూమి కంపించినట్టుగా అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. -
అలస్కాలో తీవ్ర భూకంపం
అలస్కా: అమెరికాలోని అలస్కా దక్షిణతీరంలో సంభవించిన శక్తివంతమైన తీవ్ర భూకంపం తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దీన్ని ముందు సునామీగా భావించిన జనం భయంతో ఎత్తైన కొండ ప్రాంతాలకు పరుగులు పెట్టారు. అతి తక్కువ జనాభా కలిగిన అలస్కా ద్వీపకల్పంలో ఏర్పడిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదు అయ్యింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం పెర్రివిల్లేకు ఆగ్నేయ దిశలో తీరం నుంచి సముద్రంలోకి 105 కిలోమీటర్ల దూరంలో 17 మైళ్ళ లోతులో ఈ భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటల 12 నిముషాలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌ఫై ఇంత భారీస్థాయిలో భూకంప తీవ్రత నమోదైనప్పటికీ, భూమి పెద్దగా కంపించినట్టు స్థానిక ప్రజలకు అనిపించలేదని అలస్కా రాష్ట్ర భూకంప పరిశోధకులు మైకేల్ వెస్ట్ చెప్పారు. ఇదిలా ఉండగా, అలస్కాకి 160 కిలోమీటర్ల పరిధిలోని చిన్న పట్టణాల్లో ఉన్న ప్రజలు భూమి తీవ్రంగా కంపించినట్లు భావించారని వెస్ట్ తెలిపారు. ఇంకా 805 కిలోమీటర్ల దూరంగా ఉన్నవాళ్ళు సైతం భూమి స్వల్పంగా కంపించిన విషయాన్ని గ్రహించారని వెస్ట్ చెప్పారు. ఎటువంటి నష్టం వాటిల్లినట్లు వార్తలు రాలేదని కోడియాక్ పోలీసు అధికారులు చెప్పారు. -
ఆల్బేనియాలో తీవ్ర భూకంపం
తిరానా: ఐరోపా దేశం ఆల్బేనియాలో భారీ భూకంపం సంభవించి 20 మంది చనిపోయారు. మంగళవారం ఉదయం 4 గంటలకు (స్థానిక కాలమానం) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆల్బేనియా రాజధాని తిరానాకు 30 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. రాత్రి వేళ వేళ భూకంపం రావడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. 600 మందికి పైగా గాయపడగా, భూకంపం ధాటికి మూడు భవనాలు కూలినట్లు అధికారులు వెల్లడించారు. -
హైతీలో భూకంపం.. 11 మంది మృతి
పోర్టో ప్రిన్స్: కరీబియన్ దేశమైన హైతీలో శనివారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించింది. ఘటనలో 11 మంది మృతిచెందారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. పోర్టో పేక్స్ నగరానికి వాయవ్యం వైపు 19కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూఉపరితలానికి 11.7 కి.మీ లోతున భూమి కంపించింది. -
ఫిజీలో భారీ భూకంపం
దక్షిణ పసిఫిక్ సముద్రంలో దీవుల సమూహమైన ఫిజీలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.2 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 5 గంటల 37 నిమిషాలకు భూమి కంపించడం మొదలైందని స్థానికలు చెప్పారు. ఒక్క సారిగి భూమి కంపించడం మొదలవడంలో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలోంచి బయటకి పరుగులు తీశారు. అయితే భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణనష్టంపై సమాచారం తెలియాల్సివుంది. -
ఫిజీ దీవుల్లో భారీ భూకంపం
-
ఒకే ప్రాంతంలో మూడుసార్లు భూకంపం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ప్రాంతంలో ఒకే రోజున మూడు సార్లు భూమి కంపించింది. కుల్లు జిల్లాలో శనివారం ఉదయం 6.45 ప్రాంతంలో తొలుత స్వల్పంగా భూమి కంపించిన కొన్ని గంటలకూ అదే ప్రాంతంలో మరో రెండుసార్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తొలిసారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 గా నమోదు కాగా, రెండోసారి ఉదయం 7.05 గంటల ప్రాంతంలో 4.3గానూ, మూడోసారి 9.08 గంటల ప్రాంతంలో 4.2 గా నమోదు అయినట్టు స్థానిక వాతావరణ కార్యాలయ డైరెక్టర్ మన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. కుల్లు పరిసర ప్రాంతాల్లో వరుసగా భూమి పలుమార్లు కంపించడంతో అక్కడి ప్రాంత ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు. -
బయ్యారం ఒకప్పుడు సముద్రం...
1,500 మిలియన్ సంవత్సరాల క్రితమే ఇనుపరాయి అవిర్భావం జియాలజికల్ సర్వేలో బహిర్గతమవుతున్న నిజాలు బయ్యారం: ఖమ్మం జిల్లాలోని బయ్యారం పెద్దగుట్టపై నిక్షిప్తమై ఉన్న ఇనుపరాయి ఆనవాళ్ల వివరాలు జియాలజికల్ సర్వేలో బహిర్గతమవుతున్నాయి. మూడు రోజులుగా గుట్టపై సర్వే నిర్వహిస్తున్న జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), మైన్స్ అండ్ జియాలజికల్ అధికారుల బృందాలు ఇనుపరాయి నిర్మాణం, క్వాంటిటీ, క్వాలిటీపై పలు వివరాలను తెలుసుకునే పనిలో నిమగ్నమైనారు. సర్వే బృందం కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, జీఎస్ఐ జియాలజిస్ట్ వికాస్‌త్రిపాఠి తమ సర్వేలో వెల్లడవుతున్న పలు విషయాలను శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఇనుపరాయి నిక్షేపా లు ఉన్న బయ్యారం పెద్దగుట్ట కింద 1,500 మిలియన్ సంవత్సరాల క్రితం పెద్ద సముద్రం ఉండేదని వారు పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం పాకాల బేసిన్గా పేర్కొన్న ఈ సముద్రం అడుగు భాగంలో ఇనుపరాయి ఆవిర్భవించినట్లు వారు వివరించారు.తమకు అందుబాటులో ఉన్న రేడియాక్ట్ డేటా ప్రకారం ఇనుపరాయి నిల్వలు ఏర్పడ్డ సంవత్సరం లభ్యమవుతుందన్నారు. బొగ్గు కన్న ఇనుపరాయి .. మొదట ఆవిర్భావం.. జిల్లాలో అపారంగా లభ్యమవుతున్న బొగ్గు నిక్షేపాల కన్నా ఇనుపరాయి నిక్షేపాలే మొదట ఆవిర్భవించినట్లు జియాలజికల్ అధికారులు తెలుపుతున్నారు. 1,500 మిలయన్ సంవత్సరాల క్రితం ఇనుపరాయి ఆవిర్భవించగా 65 మిలియన్ సంవత్సరాల క్రితం బొగ్గు ఆవిర్భవించినట్లు సర్వే బృందం అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
సైంటిస్ట్ ‘సామల’
=జియాలజిస్టుగా ఎంపికైన జిల్లా వాసి =యూపీఎస్సీ పరీక్షలో 221వ ర్యాంకు =రాష్ట్రపతి నుంచి నియామక ఉత్తర్వులు జారీ =బ్యాంకు ఉద్యోగి నుంచి సైంటి స్ట్ స్థాయికి ఎదిగిన రమేష్ నిన్నటివరకు ఆయనొక బ్యాంకు క్లర్క్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు హాయిగా విధులు నిర్వర్తించి ఇంటికి చేరుకునే సున్నితమైన ఉద్యోగం. కానీ.. నేటి నుంచి దేశంలో పేరెన్నిక గల జియాలాజికల్ సర్వే విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే ఉన్నత ఉద్యోగం చేయనున్నారు జిల్లాకు చెందిన సామల రమేష్. తనకున్న దాంట్లో చాలనుకునే మనస్తత్వానికి వ్యతిరేకంగా ఆలోచించిన రమేష్ నలుగురిలో ఒకరిలా కాకుండా.. నాలుగు వందల మందిలో తాను ప్రత్యేకం అనిపించుకునేందుకు అహర్నిశలు కృషిచేశారు. అనుకున్నట్లుగా శ్రమకు తగిన ఫలి తం పొందారు. ప్రభుత్వం నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలో 221వ ర్యాంకు సాధించి జూనియర్ సైంటిస్ట్ ఉద్యోగం సంపాదించారు. కృషి, పట్టుదల ఉంటే.. ఎంతటి మహాత్కార్యాన్ని అయినా సాధించవచ్చని చెబుతూ.. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ‘సామల రమేష్’ సకె ్సస్ స్టోరీపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రత్యేకం. సామల రమేష్ స్వస్థలం చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. వరంగల్‌లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అనంతరం కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ జియాలజికల్) పూర్తి చేశారు. తర్వాత పోటీ పరీక్షలు రాసిన రమేష్ 2008 సంవత్సరంలో సిండికేట్ బ్యాంకు క్లర్క్ ఉద్యోగం సంపాదించారు. ఈ సందర్భంగా కరీంనగర్లో కొద్దిరోజులపాటు విధులు నిర్వర్తించిన ఆయన ఇటీవల హన్మకొండచౌరస్తా బ్రాంచ్‌కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం కేయూలో జియాలాజికల్ సబ్జెక్టులో పీహెచ్డీ చేస్తున్నారు. 2011లో గ్రూపు ‘ఏ’ పరీక్షలకు హాజరు... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 2011లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన గ్రూపు ఏ’ జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విభాగానికి నిర్వహించిన పరీక్షలకు రమేష్ హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా రెండు లక్షల మంది రాసిన పరీక్షలకు మన రాష్ట్రం నుంచి పదివేల మందికి పైగా హాజరయ్యారు. ఈ ఫలితాలు 2012లో వెలువడగా రమేష్ అందులో 221 వ ర్యాంకు సాధించి తన ప్రతిభ చాటారు. అనంతరం ఇటీవల జరిగిన జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో రమేష్ సత్తా చాటి జూనియర్ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. అంధ్రప్రదేశ్ నుంచి 5 గురే... కాగా, యూపీఎస్సీ నిర్వహించిన గూపు ‘ఏ’ జియాలాజికల్ సర్వే ఇండియా పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి పదివేలకు పైగా పరీక్షలకు హాజరుకాగా, అందులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ముగ్గురు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఒక్కరు, కాకతీయ యూనివర్సిటీ నుంచి రమేష్ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అంతేకాదు కేయూ చరిత్రలో యూపీఎస్సీ ద్వారా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జియాలజిస్టుగా ఎంపికైన ఏకైక వ్యక్తి రమేష్. దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో మొత్తం 257 మాత్రమే అర్హత సాధించినట్లు ఆయన ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. నేటి నుంచి శిక్షణ తరగతులు... ఇదిలా ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో రమేష్‌ను జియాల జిస్టుగా నియమిస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా(రాష్ట్రపతి) కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రమేష్ జియాలజికల్ విభాగంలో నేటి నుంచి ఏడాది వర కు వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందనున్నారు. ఈ మేరకు సో మవారం హైదరాబాద్‌లోని బండ్లగూడ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ కార్యాలయంలో ప్రారంభమయ్యే తరగతులకు ఆయన హాజరుకానున్నారు. కాగా, శిక్షణ తరగతులకు జియాలాజికల్ సర్వే డెరైక్టర్ జనరల్ హాజరుకానున్న ట్లు రమేష్ తెలిపారు. ఏడాదిలో దేశంలోని సహజ సంపద కలిగిన అనేక ప్రాంతాలను సందర్శించి పరిశోధనలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఖ మ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఒరిస్సాలోని సుఖిందర్జాజ్వూర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని సుఖేటీ, హైదరాబాద్, అనంతపూర్‌లోని వజ్రకరూర్ను సందర్శించనున్నట్లు పేర్కొన్నారు.