=జియాలజిస్టుగా ఎంపికైన జిల్లా వాసి
=యూపీఎస్‌సీ పరీక్షలో 221వ ర్యాంకు
=రాష్ట్రపతి నుంచి నియామక ఉత్తర్వులు జారీ
=బ్యాంకు ఉద్యోగి నుంచి సైంటి స్ట్ స్థాయికి ఎదిగిన రమేష్
నిన్నటివరకు ఆయనొక బ్యాంకు క్లర్క్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు హాయిగా విధులు నిర్వర్తించి ఇంటికి చేరుకునే సున్నితమైన ఉద్యోగం. కానీ.. నేటి నుంచి దేశంలో పేరెన్నిక గల జియాలాజికల్ సర్వే విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే ఉన్నత ఉద్యోగం చేయనున్నారు జిల్లాకు చెందిన సామల రమేష్. తనకున్న దాంట్లో చాలనుకునే మనస్తత్వానికి వ్యతిరేకంగా ఆలోచించిన రమేష్ నలుగురిలో ఒకరిలా కాకుండా.. నాలుగు వందల మందిలో తాను ప్రత్యేకం అనిపించుకునేందుకు అహర్నిశలు కృషిచేశారు. అనుకున్నట్లుగా శ్రమకు తగిన ఫలి తం పొందారు. ప్రభుత్వం నిర్వహించిన యూపీఎస్‌సీ పరీక్షలో 221వ ర్యాంకు సాధించి జూనియర్ సైంటిస్ట్ ఉద్యోగం సంపాదించారు. కృషి, పట్టుదల ఉంటే.. ఎంతటి మహాత్కార్యాన్ని అయినా సాధించవచ్చని చెబుతూ.. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ‘సామల రమేష్’ సకె ్సస్ స్టోరీపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రత్యేకం.
సామల రమేష్ స్వస్థలం చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. వరంగల్‌లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అనంతరం కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ జియాలజికల్) పూర్తి చేశారు. తర్వాత పోటీ పరీక్షలు రాసిన రమేష్ 2008 సంవత్సరంలో సిండికేట్ బ్యాంకు క్లర్క్ ఉద్యోగం సంపాదించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో కొద్దిరోజులపాటు విధులు నిర్వర్తించిన ఆయన ఇటీవల హన్మకొండచౌరస్తా బ్రాంచ్‌కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం కేయూలో జియాలాజికల్ సబ్జెక్టులో పీహెచ్‌డీ చేస్తున్నారు.
2011లో గ్రూపు ‘ఏ’ పరీక్షలకు హాజరు...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 2011లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన గ్రూపు ఏ’ జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విభాగానికి నిర్వహించిన పరీక్షలకు రమేష్ హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా రెండు లక్షల మంది రాసిన పరీక్షలకు మన రాష్ట్రం నుంచి పదివేల మందికి పైగా హాజరయ్యారు. ఈ ఫలితాలు 2012లో వెలువడగా రమేష్ అందులో 221 వ ర్యాంకు సాధించి తన ప్రతిభ చాటారు. అనంతరం ఇటీవల జరిగిన జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో రమేష్ సత్తా చాటి జూనియర్ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు.
అంధ్రప్రదేశ్ నుంచి 5 గురే...
కాగా, యూపీఎస్‌సీ నిర్వహించిన గూపు ‘ఏ’ జియాలాజికల్ సర్వే ఇండియా పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి పదివేలకు పైగా పరీక్షలకు హాజరుకాగా, అందులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ముగ్గురు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఒక్కరు, కాకతీయ యూనివర్సిటీ నుంచి రమేష్ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అంతేకాదు కేయూ చరిత్రలో యూపీఎస్‌సీ ద్వారా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జియాలజిస్టుగా ఎంపికైన ఏకైక వ్యక్తి రమేష్. దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో మొత్తం 257 మాత్రమే అర్హత సాధించినట్లు ఆయన ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
నేటి నుంచి శిక్షణ తరగతులు...
ఇదిలా ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో రమేష్‌ను జియాల జిస్టుగా నియమిస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా(రాష్ట్రపతి) కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రమేష్ జియాలజికల్ విభాగంలో నేటి నుంచి ఏడాది వర కు వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందనున్నారు. ఈ మేరకు సో మవారం హైదరాబాద్‌లోని బండ్లగూడ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ కార్యాలయంలో ప్రారంభమయ్యే తరగతులకు ఆయన హాజరుకానున్నారు. కాగా, శిక్షణ తరగతులకు జియాలాజికల్ సర్వే డెరైక్టర్ జనరల్ హాజరుకానున్న ట్లు రమేష్ తెలిపారు. ఏడాదిలో దేశంలోని సహజ సంపద కలిగిన అనేక ప్రాంతాలను సందర్శించి పరిశోధనలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఖ మ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఒరిస్సాలోని సుఖిందర్‌జాజ్‌వూర్, హిమాచల్‌ప్రదేశ్‌లోని సుఖేటీ, హైదరాబాద్, అనంతపూర్‌లోని వజ్రకరూర్‌ను సందర్శించనున్నట్లు పేర్కొన్నారు.
సైంటిస్ట్ ‘సామల’
Published Mon, Dec 16 2013 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement