![Tremors In Delhi, Jammu And Kashmir After Earthquake In Kabul - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/9/Delhi-earth-quake.jpg.webp?itok=hwTf4IcO)
సాక్షి, న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఉత్తర భారతంపైనా ప్రభావం చూపించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో.. ఆ రాష్ట్రాల ప్రజలు భీతిల్లారు. ఈ భూకంప కేంద్రం అఫ్గానిస్థాన్‌లోని హిందుకుష్ పర్వతశ్రేణిలో ఉంది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప ప్రభావం ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలపై పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో కొద్దిసేపు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment