
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం
దేశ రాజధాని నగరం ఢిల్లీలో సోమవారం తీవ్ర భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం.. నిమిషానికిపైగా భూమి కంపిండంతో జనం...ఇళ్లు, కార్యాలయాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. జమ్మూ,కశ్మీర్‌తో పాటు ఢిల్లీ , దాని పరిసర ప్రాంతాలలో కూడా ఈ భూప్రకంపనలతో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. భూకంప తీవ్రత రిక్కర్ స్టేలుపై 7.5గా నమోదు అయింది. పరుగులు తీసారు. భూకంప తీవ్రతతో అధికారులు ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపి వేశారు. అలాగే జమ్మూ,కశ్మీర్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే హరియాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్లోనూ భూమి స్వల్పంగా కంపించినట్టు తెలుస్తోంది.
అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘననిస్తాన్ లలో కూడా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 8.1గా నమోదు కాగా, కాబూల్ కు 265 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్ పర్వత శ్రేణుల్లో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. ఆప్ఘనిస్తాన్లో జారమ్‌కు 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడగా, ఈ పాక్, ఆప్ఘన్‌పై పెను ప్రభావం ఏర్పడింది. పాక్‌లో పలుచోట్ల ఇళ్లు బీటలు వారాయి.