శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో సంభవించిన భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చేజర్ల, ఆదూరుపల్లి, పుట్టుపల్లి, దాచూరు, కొల్లపనాయుడుపల్లిలలో భూప్రకంపనలు సంభవించినట్టు సమాచారం. గురువారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. తెల్లవారుజాము వరకు ప్రకంపనలు కొనసాగినట్టు పల్లెవాసులు వెల్లడించారు.