
జమ్మూకశ్మీర్‌లో భూకంపం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3: 49 గంటల ప్రాంతంలో సంభవించిన స్వల్ప భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు నమోదు కాలేదు.
భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 3.2 పాయింట్లుగా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం జమ్మూ ప్రాంతంలో ఉందని అధికారులు వెల్లడించారు. ఎప్రిల్ 18న కశ్మీర్‌లోని కష్త్వర్ జిల్లాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.0 పాయింట్లుగా నమోదైంది.