దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం వచ్చింది. దీంతో వచ్చిన ప్రకంపనలకు ఢిల్లీ వాసులు ఒక్కసారిగా భయం గుప్పిట్లోకి జారుకున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో వచ్చిన ప్రకంపనలకు ఢిల్లీ వాసులు ఒక్కసారిగా భయం గుప్పిట్లోకి జారుకున్నారు. రిక్టర్ స్కేలుపై 3 తీవ్రతతో సరిగ్గా శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.40 నిమిషాలకు సంభవించింది. కొన్ని సెకన్లపాటు దీని ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం కూడా సరిహద్దు ప్రాంతంలోనే ఉన్నట్లు తెలియజేశారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించారు.