'భారత సైన్యం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి'
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతను స్పష్టించడానికి పొరుగు దేశం పాకిస్థాన్ కొత్త పద్ధతులు పాటిస్తోందని భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ తెలిపారు. జమ్మూ కశ్మీర్ ను నిత్యం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంచేందుకు పాక్ యత్నిస్తోందన్నారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం తరుచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని.. కేవల ఆగస్టులోనే 55 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు.
ఈ ఏడాదిలో 245 సార్లు సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. పాక్ ను కంట్రోల్ చేయడానికి భారత సైన్యం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు.