‘కల్నల్ రాయ్ అత్యంత ధైర్యసాహసి’ | 'Colonel Roy, the most dhairyasahasi' | Sakshi
Sakshi News home page

‘కల్నల్ రాయ్ అత్యంత ధైర్యసాహసి’

Published Thu, Jan 29 2015 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

‘కల్నల్ రాయ్ అత్యంత ధైర్యసాహసి’

‘కల్నల్ రాయ్ అత్యంత ధైర్యసాహసి’

న్యూఢిల్లీ: ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగిన కల్నల్ ఎన్.రాయ్ అత్యం త ధైర్య సాహసి అని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ కొనియాడారు. జమ్మూ, కశ్మీర్‌లో మంగళవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 42 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన రాయ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూపు హెడ్‌కానిస్టేబుల్ సంజీవ్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే.

కల్నల్ రాయ్ గణతంత్ర వేడుకల్లో ప్రతిష్టాత్మకమైన యుధ్‌సేవా పతకం పొందిన మర్నాడే ఉగ్రవాదుల చేతిలో బలయ్యారని పేర్కొన్నా రు. రాయ్ విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శించి యువ జవానులకు ఆదర్శంగా నిలిచారన్నారు. గురువారం ఇక్కడి బేస్ ఆస్పత్రికి రానున్న రాయ్ మృతదేహానికి ఆర్మీ చీఫ్ నివాళులు అర్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement