ఎల్వోసీ వద్ద హోరాహోరీ | Indian Army intercepts infiltrators on LoC | Sakshi
Sakshi News home page

ఎల్వోసీ వద్ద హోరాహోరీ

Published Sun, May 31 2015 8:49 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

ఎల్వోసీ వద్ద హోరాహోరీ - Sakshi

ఎల్వోసీ వద్ద హోరాహోరీ

చొరబాటుదారులు, భారత సైన్యానికి మధ్య ఎదురు కాల్పులతో కశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారీగా ఆయుధాలు కలిగిన ఓ ముష్కరు బృందం ఆదివారం ఉదయం కశ్మీర్ కుప్వారా జిల్లాలోని తగ్ధార్ సెక్టార్ వద్ద ఎల్వోసీ దాటి భారత్లోకి చొరబడేందుకు యత్నించింది.

వీరిని గుర్తించి హెచ్చరికలు చేసిన భారత సైన్యంపైకి ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో సైన్యం కూడా వారికి ధీటుగా సమాధానమిచ్చేందుకు ప్రయత్నించింది. కడపటి వార్తలు అందేవరకు కూడా హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement