infiltrators
-
చొరబాటుదార్లను తరిమికొట్టాలి
రాంచీ: అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ వివాదాస్పద మరోసారి వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని అన్నారు. లేకపోతే రాష్ట్రంలో హిందువుల జనాభా మరో 20 ఏళ్లలో సగానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులంతా ఐక్యంగా ఉండాలని కోరారు. శనివారం పాలాములో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో హిమంతబిశ్వ శర్మ ప్రసంగించారు. ఆయన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ–ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. చొరబాటుదార్లను బయటకు వెళ్లగొట్టడానికి, హిందువులను కాపాడడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. జార్ఖండ్‌లో పలు ప్రాంతాల్లో హిందువుల జనాభా ఇప్పటికే భారీగా తగ్గిపోయిందని గుర్తుచేశారు. భారతదేశాన్ని హిందువులు కాపాడుతున్నారని, జైశ్రీరామ్ అని నినదించడానికి అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఓ వర్గం ప్రజలు ఎల్లప్పుడూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకే ఓటు వేస్తున్నారని, హిందువుల ఓట్లు మాత్రం పారీ్టల వారీగా చీలిపోతున్నాయని తెలిపారు. అలా కాకుండా హిందువులంతా ఒక్కటై జేఎంఎం కూటమిని ఓడించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాం«దీపై హిమంతబిశ్వ శర్మ మండిపడ్డారు. రాహుల్ విభజన రాజకీయాలు చేస్తున్నారని, హిందువుల మధ్య చిచ్చుపెట్టి విడదీస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. అస్సాంలో జార్ఖండ్ గిరిజనులకు గుర్తింపేదీ?: హేమంత్ సోరెన్ అస్సాంలో జార్ఖండ్ గిరిజనుల గుర్తింపును హిమంతబిశ్వ శర్మ ప్రభుత్వం చెరిపేస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్ నుంచి వెళ్లిన గిరిజనులకు అస్సాంలో ఎస్టీ హోదా కలి్పంచడం లేదని విమర్శించారు. శనివారం కుంతీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సోరెన్ మాట్లాడారు. జార్ఖండ్ మూలాలున్న ప్రజలు అస్సాం టీ తోటల్లో పని చేస్తున్నారని, వారి బతుకులు దుర్బరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అస్సాం ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. బీజేపీపై సోరెన్ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ కుల మతాల పేరిట సమాజాన్ని విచి్ఛన్నం చేస్తోందని దుయ్యబట్టారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హేమంత్ సోరెన్ ధీమా వ్యక్తంచేశారు. -
BSF: 150 మంది ఉగ్రవాదులు కాచుక్కూర్చున్నారు..
శ్రీనగర్: శీతాకాలం సమీపిస్తున్నండగా కశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి 150 మంది వరకు ఉగ్రవాదులు మన భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్(సరిహద్దు భద్రతా దళం) తెలిపింది. చొరబాటుదారులు చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ‘చొరబాటు యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ నిఘా విభాగాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ఆర్మీతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దుల్లో భద్రతపై అప్రమత్తంగా ఉన్నాం’అని బీఎస్ఎఫ్ ఐజీ(కశ్మీర్) అశోక్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ‘పాక్ వైపు సరిహద్దులకు సమీపంలోని స్థావరాల్లో ఉండే ముష్కరుల గురించిన అంచనాలను బట్టి, చొరబాటుయత్నాలను తిప్పికొట్టి, వారిపై పైచేయి సాధించేలా మా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం’అని యాదవ్ వివరించారు. ‘ఎల్వోసీకి సమీపంలోని స్థావరాల్లో కాచుకుని ఉండే ఉగ్రవాదుల సంఖ్య 130–150 మధ్య మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇంతకంటే కాస్త ఎక్కువమందే ఉండొచ్చు’అని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎల్వోసీ వెంట ఉన్న తంగ్ధర్, కెరన్ సెక్టార్ల పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అవకాశాలున్నాయంటూ ఆయన..వీటిని అడ్డుకునేందుకు మొబైల్ బంకర్లు, మహిళా ట్రూపర్లను రంగంలోకి దించామని వెల్లడించారు. స్మగ్లర్లు డ్రగ్స్ కొరియర్లుగా మహిళలను వాడుకుంటున్నారని ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. -
చొరబాటుదారులపై అమిత్ షా వ్యాఖ్యలు.. బంగ్లా అభ్యంతరం
ఢాకా: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సోమవారం ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలిపింది. అమిత్ షా.. బంగ్లా జాతీయులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత విచారకరమని పేర్కొంది. ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్‌కు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ నిరసన పత్రాన్ని అందజేశారు. ఇక.. అమిత్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన బాధ, విచారాన్ని కలిగించాయని అందులో పేర్కొన్నారు.ఈ సందర్భంగా పొరుగు దేశంపై అభ్యంతరకరమైన, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయకుండా తమ రాజకీయ నేతలను హెచ్చరించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. పొరుగు దేశం జాతీయులకు ఇలా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం ఇరు దేశాల స్నేహపూర్వక పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తిని దెబ్బతీస్తాయని పేర్కొంది.ఇటీవల జార్ఖండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించిన బంగ్లాదేశ్ జాతీయులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ ప్రజలు బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. జార్ఖండ్‌లోకి అక్రమంగా చొరబడిన ప్రతీ బంగ్లాదేశ్ చొరబాటుదారుడిని తలకిందులుగా వేలాడదీసి మరీ గుణపాఠం చెబుతామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.చదవండి: శాంతి పునరుద్దరణకు భారత్ మద్దతు.. జెలెన్స్కీకి మోదీ హామీ -
చొరబాటు రాకెట్‌ను ఛేదించిన అస్సాం పోలీసులు
బంగ్లాదేశ్‌లో హింసాయుత వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే భారత సైన్యం, పోలీసులు ఇలాంటివారిని పట్టుకుని, తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు. తాజాగా అస్సాంలోకి చొరబడిన ముగ్గురు బంగ్లాదేశీయులను పోలీసులు తిరిగి ఆ దేశానికి పంపించారు. వీరు భారత్‌లోకి ప్రవేశించేందుకు సహాయం చేస్తున్న ఏజెంట్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.అలీ హుస్సేన్ అనే వ్యక్తి, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాడని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళను భారత అధికారులు తిరిగి ఆ దేశానికి అప్పగించిన దరిమిలా అలీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆ మహిళ తాను మరో 15 మందితో కలసి ఆగస్టు 17న బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి, ఇద్దరు ఏజెంట్ల సహాయంతో భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇందుకోసం అలీకి 2,500 బంగ్లాదేశ్ టాకాలు చెల్లించానని పేర్కొంది.కాగా అస్సాం పోలీసులు ముగ్గురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వీరు త్రిపుర నుంచి భారత్‌లోకి ప్రవేశించారని, వారిని బంగ్లాదేశ్‌లోని రాజ్షాహి జిల్లాకు చెందిన మహ్మద్ అబూ, అసదుల్ ఇస్లాం, మహ్మద్ సర్వర్‌గా గుర్తించామన్నారు. వీరిలో ఒకరి దగ్గర ఆధార్ కార్డు లభ్యమయ్యిదని ముఖ్యమంత్రి తెలిపారు. వీరు కూలి పనుల కోసం చెన్నైకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాగా ఈ ముగ్గురు బంగ్లాదేశీయులు త్రిపుర అంతర్ రాష్ట్ర సరిహద్దు గుండా అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. -
నలుగురు ఉగ్రవాదులు హతం
-
నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: అక్రమంగా భారత్‌లోకి అడుగుబెట్టడానికి యత్నించిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది తుదిముట్టించారు. కెరాన్ సెక్టార్ ప్రాంతంలో చొరబాటుకు యత్నిస్తుండగా.. భద్రతా సిబ్బంది వారిపైకి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు తీవ్రవాదులు హతమయ్యారని.. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని.. అధికారులు తెలిపారు. -
ఐదుగురు చొరబాటుదారుల హతం: జవాన్ మృతి
శ్రీనగర్: బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం రాత్రి భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం నుంచే భారీగా ఆయుధాలు కలిగిన ముష్కర బృందం భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిదని, సైన్యం కాల్పుల్లో ఐదుగురు మరణించగా మరికొందరు పలాయనం చిత్తగించారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. -
ఎల్వోసీ వద్ద హోరాహోరీ
చొరబాటుదారులు, భారత సైన్యానికి మధ్య ఎదురు కాల్పులతో కశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారీగా ఆయుధాలు కలిగిన ఓ ముష్కరు బృందం ఆదివారం ఉదయం కశ్మీర్ కుప్వారా జిల్లాలోని తగ్ధార్ సెక్టార్ వద్ద ఎల్వోసీ దాటి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించింది. వీరిని గుర్తించి హెచ్చరికలు చేసిన భారత సైన్యంపైకి ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో సైన్యం కూడా వారికి ధీటుగా సమాధానమిచ్చేందుకు ప్రయత్నించింది. కడపటి వార్తలు అందేవరకు కూడా హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.