ఢాకా: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సోమవారం ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలిపింది. అమిత్ షా.. బంగ్లా జాతీయులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత విచారకరమని పేర్కొంది. ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్‌కు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ నిరసన పత్రాన్ని అందజేశారు. ఇక.. అమిత్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన బాధ, విచారాన్ని కలిగించాయని అందులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పొరుగు దేశంపై అభ్యంతరకరమైన, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయకుండా తమ రాజకీయ నేతలను హెచ్చరించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. పొరుగు దేశం జాతీయులకు ఇలా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం ఇరు దేశాల స్నేహపూర్వక పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తిని దెబ్బతీస్తాయని పేర్కొంది.
ఇటీవల జార్ఖండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించిన బంగ్లాదేశ్ జాతీయులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ ప్రజలు బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. జార్ఖండ్‌లోకి అక్రమంగా చొరబడిన ప్రతీ బంగ్లాదేశ్ చొరబాటుదారుడిని తలకిందులుగా వేలాడదీసి మరీ గుణపాఠం చెబుతామని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
చదవండి: శాంతి పునరుద్దరణకు భారత్ మద్దతు.. జెలెన్‌స్కీకి మోదీ హామీ
Comments
Please login to add a commentAdd a comment