
సర్జికల్ స్ట్రైక్స్: ధోవల్‌కు పాక్ ఎన్‌ఎస్‌ఏ ఫోన్!
న్యూఢిల్లీ: పీవోకేలో భారత సైన్యం సర్జికల్ దాడులతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఉగ్రవాదులు దాడులతో అలజడి రేపుతుండగా మరోవైపు కాల్పుల ఉల్లంఘన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దుల మీదుగా ఉన్న గ్రామాలను ఖాళీ చేయించి.. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) నసీర్ జంజువా భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇద్దరూ అంగీకరించారు. ఈ విషయాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తజ్ అజిజ్ తెలిపినట్టు పాక్ మీడియా తెలిపింది.