ఛండీఘర్: పంజాబ్ రాష్ట్రంలోని వాఘా సరిహద్దులో గురువారం జరగాల్సిన బీటింగ్ రిట్రీట్ రద్దు అయింది. ఎల్వోసీ వద్ద ఉద్రిక్తల నేపథ్యంలో అట్టారి-వాఘా బోర్డర్ వద్ద జరిగే రిట్రీట్ను బీఎస్ఎఫ్ రద్దు చేసింది. ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరుగుతుంది. 1959 నుండి ఈ ఆనవాయితీ ఉన్నది.
అరగంటపాటు జరిగే ఈ రీట్రీట్ను వీక్షించేందుకు ఇరు దేశాల నుంచి వందలాంది మంది వస్తుంటారు. ఇక్కడకు వచ్చే ప్రతి వారూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తారు. అయితే అట్టావా నుంచి రిట్రీట్కు వెళ్లేందుకు పర్యాటకులతో పాటు సందర్శకులు ఆసక్తి చూపనట్లు సమాచారం. అయితే రిట్రీట్ను ఎందుకు రద్దు చేశారో తమకు స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.