25 ఏళ్ల కార్గిల్
కార్గిల్ వార్‌లో భారత పతాకం విజయగర్వంతో నిలబడి 25 ఏళ్లు. వీరులు శూరులై్రపాణాలను చిరునవ్వుతో త్యాగం చేసి ఎందరో సైనికులు అమరులైతే మనకా విజయం సిద్ధించింది. వారి కథలు గాథలు తలుచుకోవాల్సిన సమయం ఇది. అందుకై ‘రజత్ జయంతి వర్ష్’ పేరుతో ఉత్సవాలు సాగుతున్నాయి. ఆ యుద్ధ సమయపు తెగువను బాలీవుడ్ గొప్పగా చూపించింది. ఆ సినిమాలను పిల్లలకు చూపించాలి ఈ వీకెండ్.
పాతికేళ్లంటే కనీసం మూడుతరాలు వచ్చి ఉంటాయ్. దేశం దాటిన క్లిష్ట పరిస్థితులు ఏ తరానికి ఆ తరం స్ఫూర్తిదాయకంగా అందిస్తూ ఉండాలి. అప్పుడే ఆ స్ఫూర్తిని కొత్తతరం అందిపుచ్చుకుంటూ ఉంటుంది. అనూహ్యంగా మన ్రపాంతంలో చొరబడి వాస్తవాధీన రేఖ దగ్గర 1999లో టైగర్ హిల్‌ను ఆక్రమించింది పాకిస్తాన్. వారిని వెనక్కు తరిమి కొట్టడానికి భారత సైన్యం రంగంలో దిగింది. మే 2 నుంచి జూలై 26 వరకు అంటే రెండు నెలల మూడు వారాల రెండు రోజుల పాటు ఈ యుద్ధం సాగింది. ఆక్రమిత ్రపాంతం కొండ కావడంతో పై నుంచి శత్రువులు సులభంగా దాడి చేసే పరిస్థితి ఉండటంతో ఈ యుద్ధం ఒక సవాలుగా మారింది. అయినా సరే మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కలిసి విజయం సాధించాయి. తర్వాతి కాలంలో ఈ యుద్ధ నేపథ్యంలో ఎంతో సాహిత్యం, పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. వాటిలో
బాలీవుడ్ నుంచి వచ్చిన ముఖ్యమైన సినిమాలు ఇవి... 1) లక్ష్య 2) షేర్ షా 3) ఎల్‌ఓసి కార్గిల్ 4) గుంజన్‌సక్సేనా 5. ధూప్.
1. లక్ష్య (2004)
లక్ష్య రహితమైన ఒక యువకుడు కార్గిల్ యుద్ధంలో దేశానికి సేవ చేయడమే తన లక్ష్యం అని గ్రహించడమే ‘లక్ష్య’. హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమాలో అమితాబ్, బొమన్ ఇరాని, ఓం పురి వంటి ఉద్ధండులు నటించారు. పెద్దగా బాధ్యత పట్టని హృతిక్ రోషన్ తన స్నేహితుడు రాస్తున్నాడని డిఫెన్స్ సర్వీస్ అకాడెమీ పరీక్షలు రాసి ఇండియన్ మిలటరీ అకాడెమీలో సీట్ తెచ్చుకుంటాడు. కాని ట్రయినింగ్ అతని వల్ల కాదు. పారి΄ోయి వస్తాడు.
అయితే అందరూ అతణ్ణి తక్కువ దృష్టితో చూసే సరికి ఈసారి పట్టుదలగా వెళ్లి ట్రయినింగ్ పూర్తి చేసి పంజాబ్ బెటాలియన్‌కు ఎంపికవుతాడు. అదే సమయంలో కార్గిల్ యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో 1000 అడుగుల కొండ మొనపై ఉన్న పాకిస్తాన్ యూనిట్‌ను కడతేర్చడానికి భారత సైన్యం నుంచి బయలుదేరిన 12 మందిలో హృతిక్ కూడా ఒకడు. వీరిలో ఆరుగురు మరణించినా పాకిస్తాన్ యూనిట్‌ను ధ్వంసం చేసి విజయం సాధిస్తారు. ఫర్హాన్ అక్తర్ దర్వకత్వం వహించిన ఈ సినిమా విడుదల సమయంలో ఆదరణ ΄÷ందక΄ోయినా తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. చాలా మంది కుర్రాళ్లను సైన్యంలో చేరేందుకు ఈ సినిమా ప్రేరేపించింది.
2. షేర్‌షా (2021)
‘యుద్ధానికి వెళుతున్నాను. మన దేశపతాకాన్ని ఎగరేసి వస్తాను లేదా అందులో చుట్టబడైనా వస్తాను’ అని చెప్పిన ఆర్మీ ఆఫీసర్ విక్రమ్ బాత్ర బయోపిక్ షేర్‌షా. కార్గిల్ యుద్ధంలో ఊరికే అరాకొరా శత్రువులను నేల రాల్చడం తన తత్వం కాదని ‘ఏ దిల్ మాంగే మోర్’ తన నినాదమని అందరు శత్రువులను నామరూపాల్లేకుండా చేస్తానని చెప్పిన విక్రమ్ బాత్ర అలాగే చేసి మన పతాకం ఎగురవేసి ్రపాణాలు కోల్పోయాడు. సిద్దార్థ్ మల్హోత్ర, కియారా అద్వానీ నటించిన ఈ సినిమా కోవిడ్ కారణంగా అమెజాన్‌లో స్ట్రీమ్ అయ్యింది. తమ ΄్లాట్‌ఫామ్ మీద అత్యధికులు వీక్షించిన సినిమా షేర్‌షా అని అమెజాన్ తెలిపింది. తుపాకీ గుళ్లు మరఫిరంగుల ఘీంకారాలు మాత్రమే వినపడే యుద్ధ రంగంలో సైనికుల మానసిక స్థితి, వారు ప్రదర్శించే స్థయిర్యం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడాలి. కార్గిల్ వీరునికి గొప్ప నివాళి ఈ సినిమా.
3.ఎల్‌ఓసి కార్గిల్ (2003)
1997లో ‘బోర్డర్’ వంటి సూపర్‌హిట్ తీసిన జె.పి.దత్తా కార్గిల్‌వార్ మీద తీసిన 4 గంటల 15 నిమిషాల సుదీర్ఘమైన సినిమా ఎల్‌ఓసి కార్గిల్. వాస్తవాధీన రేఖను దాటి పాకిస్తాన్ సైన్యం కార్గిల్‌లో తిష్ట వేశాక వివిధ దళాలు ఎన్ని విధాలుగా కార్యరంగంలో దిగుతాయి సైనిక తంత్రాలు ఎలా ఉంటాయి ఆఫీసర్లకు వారి దళాలకు సమన్వయం ఎలా ఉంటుందో ఇవన్నీ దాదాపుగా తెలియాలంటే ఈ సినిమా తీయాలి. నిడివి రీత్యా ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేక΄ోయినా దర్శకుడు పట్టుబట్టి అలాగే ఉంచేశాడు. సంజయ్ దత్, అజయ్ దేవగణ్, సన్ని డియోల్, సునీల్ శెట్టి, అభిషేక్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది.
4. గుంజన్ సక్సేనా (2020)
‘కార్గిల్ గర్ల్’గా ఖ్యాతి గడించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన గుంజన్ పైలట్ కావాలని కలలు కంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అమ్మాయిలకు అప్పుడే ప్రవేశం కల్పించినా ట్రయినింగ్ సమయంలో ఆ మగవాళ్ల ప్రపంచంలో సవాళ్లు ఎదుర్కొంది గుంజన్. 1996లో భారతదేశ తొలి ఎయిర్‌ఫోర్స్ మహిళా పైలట్‌లలో ఒకరైన గుంజన్ 1999లో కార్గిల్‌లో చురుకైన పాత్ర ΄ోషించింది. యుద్ధ సమయంలో గాయపడిన వారిని బేస్ క్యాంప్‌కు తరలించి వైద్యం అందించడంలో లెక్కకు మించి చక్కర్లు కొట్టింది. మిస్సయిల్స్‌కు అందితే ్రపాణాలు చెల్లాచెదురవుతాయని తెలిసినా ఆమె సాహసం కొనసాగింది. జాన్హీ్వ కపూర్ నటించిన ఈ సినిమా అమ్మాయిలకు సమాన అవకాశాలు అన్నింటా కావాలని చెబుతుంది.
5. ధూప్ (2003)
యుద్ధంలో బలిదానం ఇచ్చిన వీరులను శ్లాఘించడం సరే నిజ జీవితంలో వారి కుటుంబం ఎటువంటి గౌరవాన్ని ΄÷ందుతోంది అని ప్రశ్నించే సినిమా ధూప్. కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ అనుజ్ నయ్యర్ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను ఆధారం చేసుకుని ఈ సినిమా తీశారు. అనుజ్ మరణించాక ప్రభుత్వం వారికి ఒక పెట్రోల్ బంక్ కేటాయిస్తుంది. కుటుంబ సభ్యులు ఇందుకు మొదట నిరాకరించినా కొడుకు స్మృతిని నిలబెట్టడానికి ఇదొక మార్గమని భావించి అందుకు అంగీకరిస్తుంది. అయితే అక్కడి నుంచే కథ మొదలవుతుంది. ప్రభుత్వం కేటాయించిన పెట్రోల్ బంక్ వాస్తవ రూపం దాల్చాలంటే ఎన్ని లంచాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు ఎదురవుతాయో ఈ సినిమా చూపిస్తుంది. చివరకు కుటుంబం పెట్రోల్ బంక్ సాధించి దానికి ‘కార్గిల్ హైట్స్’ అని పేరు పెడుతుంది. అమరుల రుణం తీర్చుకునే దారిలో ప్రభుత్వం, ΄ûరులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని చెప్పే చిత్రం ఇది. ఓంపురి,రేవతి తారాగణం.
Comments
Please login to add a commentAdd a comment