Lakshya Movie
-
Kargil Vijay Diwas: యుద్ధం: ఈ సినిమాలు పిల్లలకు చూపిద్దాం!
కార్గిల్ వార్‌లో భారత పతాకం విజయగర్వంతో నిలబడి 25 ఏళ్లు. వీరులు శూరులై్రపాణాలను చిరునవ్వుతో త్యాగం చేసి ఎందరో సైనికులు అమరులైతే మనకా విజయం సిద్ధించింది. వారి కథలు గాథలు తలుచుకోవాల్సిన సమయం ఇది. అందుకై ‘రజత్ జయంతి వర్ష్’ పేరుతో ఉత్సవాలు సాగుతున్నాయి. ఆ యుద్ధ సమయపు తెగువను బాలీవుడ్ గొప్పగా చూపించింది. ఆ సినిమాలను పిల్లలకు చూపించాలి ఈ వీకెండ్.పాతికేళ్లంటే కనీసం మూడుతరాలు వచ్చి ఉంటాయ్. దేశం దాటిన క్లిష్ట పరిస్థితులు ఏ తరానికి ఆ తరం స్ఫూర్తిదాయకంగా అందిస్తూ ఉండాలి. అప్పుడే ఆ స్ఫూర్తిని కొత్తతరం అందిపుచ్చుకుంటూ ఉంటుంది. అనూహ్యంగా మన ్రపాంతంలో చొరబడి వాస్తవాధీన రేఖ దగ్గర 1999లో టైగర్ హిల్‌ను ఆక్రమించింది పాకిస్తాన్. వారిని వెనక్కు తరిమి కొట్టడానికి భారత సైన్యం రంగంలో దిగింది. మే 2 నుంచి జూలై 26 వరకు అంటే రెండు నెలల మూడు వారాల రెండు రోజుల పాటు ఈ యుద్ధం సాగింది. ఆక్రమిత ్రపాంతం కొండ కావడంతో పై నుంచి శత్రువులు సులభంగా దాడి చేసే పరిస్థితి ఉండటంతో ఈ యుద్ధం ఒక సవాలుగా మారింది. అయినా సరే మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కలిసి విజయం సాధించాయి. తర్వాతి కాలంలో ఈ యుద్ధ నేపథ్యంలో ఎంతో సాహిత్యం, పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. వాటిలో బాలీవుడ్ నుంచి వచ్చిన ముఖ్యమైన సినిమాలు ఇవి... 1) లక్ష్య 2) షేర్ షా 3) ఎల్ఓసి కార్గిల్ 4) గుంజన్‌సక్సేనా 5. ధూప్.1. లక్ష్య (2004)లక్ష్య రహితమైన ఒక యువకుడు కార్గిల్ యుద్ధంలో దేశానికి సేవ చేయడమే తన లక్ష్యం అని గ్రహించడమే ‘లక్ష్య’. హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమాలో అమితాబ్, బొమన్ ఇరాని, ఓం పురి వంటి ఉద్ధండులు నటించారు. పెద్దగా బాధ్యత పట్టని హృతిక్ రోషన్ తన స్నేహితుడు రాస్తున్నాడని డిఫెన్స్ సర్వీస్ అకాడెమీ పరీక్షలు రాసి ఇండియన్ మిలటరీ అకాడెమీలో సీట్ తెచ్చుకుంటాడు. కాని ట్రయినింగ్ అతని వల్ల కాదు. పారి΄ోయి వస్తాడు. అయితే అందరూ అతణ్ణి తక్కువ దృష్టితో చూసే సరికి ఈసారి పట్టుదలగా వెళ్లి ట్రయినింగ్ పూర్తి చేసి పంజాబ్ బెటాలియన్‌కు ఎంపికవుతాడు. అదే సమయంలో కార్గిల్ యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో 1000 అడుగుల కొండ మొనపై ఉన్న పాకిస్తాన్ యూనిట్‌ను కడతేర్చడానికి భారత సైన్యం నుంచి బయలుదేరిన 12 మందిలో హృతిక్ కూడా ఒకడు. వీరిలో ఆరుగురు మరణించినా పాకిస్తాన్ యూనిట్‌ను ధ్వంసం చేసి విజయం సాధిస్తారు. ఫర్హాన్ అక్తర్ దర్వకత్వం వహించిన ఈ సినిమా విడుదల సమయంలో ఆదరణ ΄÷ందక΄ోయినా తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. చాలా మంది కుర్రాళ్లను సైన్యంలో చేరేందుకు ఈ సినిమా ప్రేరేపించింది.2. షేర్షా (2021)‘యుద్ధానికి వెళుతున్నాను. మన దేశపతాకాన్ని ఎగరేసి వస్తాను లేదా అందులో చుట్టబడైనా వస్తాను’ అని చెప్పిన ఆర్మీ ఆఫీసర్ విక్రమ్ బాత్ర బయోపిక్ షేర్షా. కార్గిల్ యుద్ధంలో ఊరికే అరాకొరా శత్రువులను నేల రాల్చడం తన తత్వం కాదని ‘ఏ దిల్ మాంగే మోర్’ తన నినాదమని అందరు శత్రువులను నామరూపాల్లేకుండా చేస్తానని చెప్పిన విక్రమ్ బాత్ర అలాగే చేసి మన పతాకం ఎగురవేసి ్రపాణాలు కోల్పోయాడు. సిద్దార్థ్ మల్హోత్ర, కియారా అద్వానీ నటించిన ఈ సినిమా కోవిడ్ కారణంగా అమెజాన్‌లో స్ట్రీమ్ అయ్యింది. తమ ΄్లాట్‌ఫామ్ మీద అత్యధికులు వీక్షించిన సినిమా షేర్షా అని అమెజాన్ తెలిపింది. తుపాకీ గుళ్లు మరఫిరంగుల ఘీంకారాలు మాత్రమే వినపడే యుద్ధ రంగంలో సైనికుల మానసిక స్థితి, వారు ప్రదర్శించే స్థయిర్యం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడాలి. కార్గిల్ వీరునికి గొప్ప నివాళి ఈ సినిమా.3.ఎల్ఓసి కార్గిల్ (2003)1997లో ‘బోర్డర్’ వంటి సూపర్‌హిట్ తీసిన జె.పి.దత్తా కార్గిల్‌వార్ మీద తీసిన 4 గంటల 15 నిమిషాల సుదీర్ఘమైన సినిమా ఎల్ఓసి కార్గిల్. వాస్తవాధీన రేఖను దాటి పాకిస్తాన్ సైన్యం కార్గిల్‌లో తిష్ట వేశాక వివిధ దళాలు ఎన్ని విధాలుగా కార్యరంగంలో దిగుతాయి సైనిక తంత్రాలు ఎలా ఉంటాయి ఆఫీసర్లకు వారి దళాలకు సమన్వయం ఎలా ఉంటుందో ఇవన్నీ దాదాపుగా తెలియాలంటే ఈ సినిమా తీయాలి. నిడివి రీత్యా ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేక΄ోయినా దర్శకుడు పట్టుబట్టి అలాగే ఉంచేశాడు. సంజయ్ దత్, అజయ్ దేవగణ్, సన్ని డియోల్, సునీల్ శెట్టి, అభిషేక్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది.4. గుంజన్ సక్సేనా (2020)‘కార్గిల్ గర్ల్’గా ఖ్యాతి గడించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన గుంజన్ పైలట్ కావాలని కలలు కంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అమ్మాయిలకు అప్పుడే ప్రవేశం కల్పించినా ట్రయినింగ్ సమయంలో ఆ మగవాళ్ల ప్రపంచంలో సవాళ్లు ఎదుర్కొంది గుంజన్. 1996లో భారతదేశ తొలి ఎయిర్‌ఫోర్స్ మహిళా పైలట్లలో ఒకరైన గుంజన్ 1999లో కార్గిల్‌లో చురుకైన పాత్ర ΄ోషించింది. యుద్ధ సమయంలో గాయపడిన వారిని బేస్ క్యాంప్‌కు తరలించి వైద్యం అందించడంలో లెక్కకు మించి చక్కర్లు కొట్టింది. మిస్సయిల్స్కు అందితే ్రపాణాలు చెల్లాచెదురవుతాయని తెలిసినా ఆమె సాహసం కొనసాగింది. జాన్హీ్వ కపూర్ నటించిన ఈ సినిమా అమ్మాయిలకు సమాన అవకాశాలు అన్నింటా కావాలని చెబుతుంది.5. ధూప్ (2003)యుద్ధంలో బలిదానం ఇచ్చిన వీరులను శ్లాఘించడం సరే నిజ జీవితంలో వారి కుటుంబం ఎటువంటి గౌరవాన్ని ΄÷ందుతోంది అని ప్రశ్నించే సినిమా ధూప్. కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ అనుజ్ నయ్యర్ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను ఆధారం చేసుకుని ఈ సినిమా తీశారు. అనుజ్ మరణించాక ప్రభుత్వం వారికి ఒక పెట్రోల్ బంక్ కేటాయిస్తుంది. కుటుంబ సభ్యులు ఇందుకు మొదట నిరాకరించినా కొడుకు స్మృతిని నిలబెట్టడానికి ఇదొక మార్గమని భావించి అందుకు అంగీకరిస్తుంది. అయితే అక్కడి నుంచే కథ మొదలవుతుంది. ప్రభుత్వం కేటాయించిన పెట్రోల్ బంక్ వాస్తవ రూపం దాల్చాలంటే ఎన్ని లంచాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు ఎదురవుతాయో ఈ సినిమా చూపిస్తుంది. చివరకు కుటుంబం పెట్రోల్ బంక్ సాధించి దానికి ‘కార్గిల్ హైట్స్’ అని పేరు పెడుతుంది. అమరుల రుణం తీర్చుకునే దారిలో ప్రభుత్వం, ΄ûరులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని చెప్పే చిత్రం ఇది. ఓంపురి,రేవతి తారాగణం. -
Independence Day 2023: మేరా భారత్ మహాన్
దేశం అనగానే భారతీయ ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయిపోతారు. సరైన దేశభక్తి సినిమా వస్తే సూపర్ డూపర్ హిట్ చేసి భావోద్వేగంతో ఊగిపోతారు. బాలీవుడ్లో మంచి మంచి దేశభక్తి సినిమాలు వచ్చాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన 10 దేశభక్తి సినిమాలు.. హకీకత్ (1964): దేశాల మధ్య యుద్ధాలు వస్తే సైనికుల వీరోచిత పోరాటాలు, త్యాగాలు తప్పనిసరి. వాటిని చూపుతూనే యుద్ధాలు ఎలా సగటు సైనికుడి ్రపాణాలు బలిగొంటాయో కూడా చూపిన సినిమా హకీకత్. 1962 నాటి ఇండో చైనా యుద్ధం మీద వచ్చిన ఈ సినిమా అతి తక్కువ మంది భారత సైనిక పటాలం చైనా భారీ సేనతో ఎలా తలపడిందో చూపుతుంది. బల్రాజ్ సహానీ, ధరేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. కైఫీ ఆజ్మీ రాసిన ప్రఖ్యాత దేశభక్తి గీతం ‘కర్ చలే హమ్ ఫిదా జాన్ ఏ వతన్ సాథియో’ ఇందులోదే. ఉప్కార్ (1967): దేశభక్తి సినిమాలు తీసి ‘మిస్టర్ భరత్’ బిరుదు ΄÷ందిన నటుడు మనోజ్ కుమార్ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సూచన మేరకు ‘జై జవాన్ జై కిసాన్’ నినాదానికి ఇచ్చిన సినీ రూపం ‘ఉప్కార్’. సైనికులు దేశ సరి హద్దుల వద్ద మాత్రమే సంఘర్షణ చేస్తారు... కాని రైతులు దేశంలో జీవితాంతం సంఘర్షణ చేసి గింజలు పండించి జనం కడుపులు నింపుతారు... వారే నిజమైన హీరోలు అని చెప్పే సినిమా ఇది. ‘ఇస్ దేశ్ కి ధర్తీ ఉగ్లే హీరా మోథీ’ హిట్ గీతం ఇందులోదే. బోర్డర్ (1997): యుద్ధంలో చావు కళ్ల ముందు కదలాడుతుంటే దేశం తప్ప మరేమీ గుర్తు రాక సంతోషంగా బలిదానం ఇచ్చే సైనికుల వీరత్యాగం ఎలా ఉంటుందో ‘బోర్డర్’లో చూడాలి. 1971 నాటి ఇండో పాక్ యుద్ధాన్ని కథాంశంగా తీసుకుని దర్శకుడు జె.పి. దత్తా తీసిన ఈ సినిమా ఒక గొప్ప వార్ మూవీ. సన్ని డియోల్, సునీల్ శెట్టి తదితరులు నటించిన ఈ సినిమాలో సైనికుల జీవితాన్ని వాస్తవికంగా చూపడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. యుద్ధ వ్యూహాలు కూడా ఈ సినిమాలో తెలుస్తాయి. లగాన్ (2001): దేశభక్తికి క్రీడలు జత చేసి గొప్ప సంచలనం సృష్టించిన సినిమా ‘లగాన్’. పన్నుల మీద పన్నులు వేసి దాష్టీకం చేస్తున్న బ్రిటిష్ వారిని చిన్న పల్లెజనం క్రికెట్లో ఓడించడం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఆస్కార్ నామినేషన్ ΄÷ందింది. అద్భుతమైన కథనం, సంగీతం, నటన, భావోద్వేగాలు, ఆటలో ఉండే మలుపులు తోడు కావడంతో ప్రేక్షకులు జేజేలు పలికారు. ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్ (2002): అమర దేశభక్తుడు భగత్ సింగ్ కథను తీసుకుని రాజ్ కుమార్ సంతోషి తీసిన అద్భుతమైన సినిమా ఇది. అజయ్ దేవగణ్– భగత్ సింగ్ పాత్రను పోషించి ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించాడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్... ఈ ముగ్గురు దేశభక్తులు తమ ఉడుకు నెత్తురుతో దేశం కోసం పోరాడి లేత వయసులో మరణించడం ప్రేక్షకుల మనసు కలచి వేసేలా ఈ సినిమా చూపుతుంది. దేశం కోసం ఎలాంటి స్ఫూర్తితో ఉండాలో తెలుపుతుంది. లక్ష్య (2004): మంచి దేశభక్తి సినిమా మాత్రమే కాదు యువతను లక్ష్యం వైపు నడిపించే సినిమా కూడా. రిలీజైనప్పుడు ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉన్నా ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. కార్గిల్ వార్‌ను నేపథ్యంగా తీసుకుని గొప్ప సాంకేతిక విలువలతో తీశారు. హృతిక్ రోషన్‌తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. మిలట్రీ వాతావరణం, క్రమశిక్షణ, ధీరత్వం ఈ సినిమాలో పుష్టిగా చూడొచ్చు. స్వదేశ్ (2004): ఈ దేశం నీకేమిచ్చిందని కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అని తరచి ప్రశ్నించుకోవాలని నెహ్రూ అన్నారు. ఆ ప్రశ్నకు జవాబు ఈ సినిమా. ఈ దేశంలో పుట్టి పెరిగి చదువుకుని పరాయి దేశానికి వెళ్లి ఆ దేశానికి సేవ చేయడం తప్పు కాదు కానీ మన దేశానికి ఏదైనా చేయాలన్న బాధ్యతను మరువకూడదని ఎంతో గట్టిగా చెప్పింది ‘స్వదేశ్’. షారూక్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఎన్ఆర్ఐల బాధ్యతను నిలదీసిన సినిమా ఇది. రంగ్ దే బసంతి(2006): ఉద్యోగం వచ్చే చదువును చదువుకోవడం వేరు, దేశం పట్ల చైతన్యాన్ని కలిగించుకుని బాధ్యతను గుర్తెరగడం వేరు. నేటి యువత తమ కెరీర్‌ను వెతుక్కుంటున్నది గాని దేశం కోసం ఏం చేయాలో ఆలోచించడం లేదు. ‘రంగ్ దే బసంతి’... అల్లరి చిల్లరి యూనివర్సిటీ కుర్రాళ్లను దేశం కోసం ఏదైనా గట్టిగా చేయాలని నిర్ణయించుకోవడాన్ని చూపుతుంది. పుచ్చిపోయిన వ్యవస్థను సరిచేయాలనుకుని ్రపాణాలు అర్పించే కుర్రాళ్ల కథ ఇది. రాకేష్ మెహ్రా దర్శకుడు. ఆమిర్ ఖాన్ హీరో. ది ఫర్గాటెన్ హీరో (2004): నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం ఈ దేశం గుండె సగర్వంగా స్పందిస్తూనే ఉంటుంది. బ్రిటిష్ వారిపై పోరాడటానికి ఏకంగా సైన్యాన్ని నిర్మించిన ధీరుడు ఆయన. నేతాజీ మరణం ఇంకా మిస్టరీనే. నేతాజీ జీవితాన్ని అథెంటిక్‌గా చూపిన సినిమా ఇది. శ్యామ్ బెనగళ్ దర్శకునిగా ఎంత రీసెర్చ్ చేశాడో తెలుస్తుంది. నేతాజీగా సచిన్ ఖడేకర్ అద్భుతంగా నటించారు. గతించిన చరిత్రకు దర్పణం ఈ సినిమా. రాజీ (2018): దేశం కోసం గూఢచారిగా పని చేసి త్యాగాలు చేసిన వారు ఎందరో. వారిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. అలాంటి ఒక స్త్రీ కథ ‘రాజీ’. ఆలియా భట్ నటించిన ఈ సినిమా పాకిస్తాన్‌కు కోడలుగా వెళ్లి అక్కడ భారత్ కోసం గూఢచారిగా పని చేసిన సెహమత్ అనే స్త్రీ ఎదుర్కొన్న సవాళ్లను చూపుతుంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో నిర్మితమైనా భారీ వసూళ్లను రాబట్టింది. -
ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్
సంక్రాంతి సందర్భంగా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చాయి. ఈరోజు(జనవరి 7) ఓటీటీలో ఏకంగా మూడు సినిమాలు విడుదల కావడం విశేషం. వీటీలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప' నేడు రాత్రి 8 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్.. ఈ మూవీతో పాటు ఓటీటీలోకి మరో యంగ్ హీరో నాగశౌర్య కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నాగశౌర్య 2021లో నటించిన ‘వరుడు కావలెను, ‘లక్ష్య’ చిత్రాలు నేటి(జనవరి 7) ఉదయం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. జీ5 ఓటీటీలో 'వరుడు కావలెను'... ఆహాలో 'లక్ష్య' స్ట్రీమింగ్ ప్రారంభమయింది. ఒకే రోజున మూడు సినిమాలు ఓటీటీలో విడుదల కావడంతో సినీ అభిమానుల వినోదం మరింత రెట్టింపయ్యింది. చదవండి: ప్రకాశ్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ కృష్ణవంశీ -
అప్పుడే ఓటీటీకి నాగశౌర్య లక్ష్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Naga Shaurya Lakshya Movie Streaming On OTT: యంగ్ హీరో నాగ శౌర్య, ‘రొమాంటిక్ మూవీ బ్యూటీ కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం లక్ష్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిన ఈమూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం నాగశౌర్య ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అంతేగాక సిక్స్ ప్యాక్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రెండు విభిన్న లుక్‌లో అలరించిన నాగశౌర్య నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన సామ్, షాకవుతున్న నెటిజన్లు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోంది. మూవీ రిలీజ్ నెల రోజుల కూడా కాకముందే లక్ష్య డిజిటిల్ ప్లాట్‌ఫాంలో సందడి చేయడం విశేషం. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహాలో 2022 జనవరి 7 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాళ భైరవ సంగీతాన్ని సమకుర్చారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న శ్యామ్ సింగరాయ్!, స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. గమనమా, గమ్యమా? ఏది ముఖ్యం? Watch sports action drama #Lakshya Jan 7 on aha.@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/3xCb5pFrax — ahavideoIN (@ahavideoIN) December 27, 2021 -
‘లక్ష్య’ మూవీ రివ్యూ
టైటిల్ : లక్ష్య నటీనటులు : నాగశౌర్య, కేతిక శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, శత్రు, రవిప్రకాశ్, సత్య తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి సంగీతం : కాలభైరవ సినిమాటోగ్రఫీ :రామ్‌రెడ్డి ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది : డిసెంబర్ 10, 2021 Lakshya Movie Review: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాగశౌర్య .. ఆ మూవీతో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ వైవిధ్యాన్నిచూపిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే ఇరవై పైగా సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ‘ఛలో’సినిమాతో నిర్మాతగా మారి తొలి చిత్రమే హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా, హీరోగా చేసిన నర్తనశాల, అశ్వథ్థామ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో చాలా గ్యాప్ తీసుకొని ఇటీవల లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’తో ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మరోసారి ప్రయోగానికి సిద్దమై.. తన కెరీర్లోనే తొలిసారిస్పోర్ట్స్ బేస్డ్ కాన్సెప్ట్‌తో ‘లక్ష్య’ మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ని కూడా కొత్తగా, చాలా గ్రాండ్‌గా చేయడంతో ‘లక్ష్య’పై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది? మరి ఈ సినిమా నాగశౌర్యను హిట్ ట్రాక్ ఎక్కించిందా? రివ్యూలో చూద్దాం కథేంటంటే.. పార్ధు(నాగశౌర్య) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో.. తాతయ్య రఘురామయ్య(సచిన్ ఖేడేకర్)దగ్గరే పెరుగుతాడు. అతని తండ్రి లాగే పార్దుకు కూడా విలువిద్య అంటే చాలా ఇష్టం. అతనిలోని క్రీడాకారుడిని గుర్తించిన తాతయ్య.. ఎలాగైన తన మనవడిని గొప్ప ఆర్చరీ ప్లేయర్ చేయాలని భావిస్తాడు. దాని కోసం ఊరిని వదిలి సిటీకి వస్తాడు. ఆస్తులన్ని అమ్మి మరీ మనవడి కోచింగ్ ఇప్పిస్తాడు. పార్ధు కూడా కష్టపడి స్టెట్ లెవన్ చాంపియన్ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్ ట్రయల్స్‌కి సన్నద్దం అయ్యే సమయంలో గుండెపోటుతో తాతయ్య మరణిస్తాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పార్ధు.. మత్తు పదార్ధాలకు బానిస అవుతాడు. డ్రగ్స్ తీసుకుంటేనే అతను వదిలిన బాణం గురి తప్పేది కాదు. ఈ విషయం తెలిసి అకాడమీ అతన్ని సస్పెండ్ చేస్తుంది. అసలు పార్థు మత్తు పదార్ధాలకు బానిస కావడానికి కారణం ఎవరు? అతని జీవితంలో రితికా పాత్ర ఏంటి? చనిపోదామనుకున్న సమయంలో పార్ధుని కాపాడిన సారథి(జగపతిబాబు)..ఎవరు? అతని నేపథ్యం ఏంటి? విలువిద్యకు దూరమైన పార్థు మళ్లీ చేత బాణం పట్టి రాణించాడా? వరల్డ్ చాంపియన్‌గా చూడాలనుకున్న తాతయ్య కోరికను నెరవేర్చాడా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారు? ఆర్చరీ ప్లేయర్ పార్థుగా నాగశౌర్య చక్కగా నటించాడు. ఈ సినిమాకు కోసం ఎనిమిది పలకల దేహాన్ని తయారు చేశాడు. అతను పడ్డ కష్టం తెరపై కనిపించింది. లుక్ పరంగా నాగశౌర్య చాలా కొత్తగా కనిపించాడు. తాతయ్య చనిపోయినప్పుడు వచ్చిన ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక ‘రొమాంటిక్’భామ కేతికా శర్మ.. రితికా పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్‌తో కాకుండా నటనతో ఆకట్టుకుంది. హీరో తాతయ్యగా సచిన్ ఖేడేకర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. సారథిగా జగపతి బాబు నటన బాగుంది. సత్య, భరత్ రెడ్డి, శత్రులతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో చాలానే వచ్చాయి. ఒక్కడు, సై తో పాటు ఈ ఏడాదిలో వచ్చిన నితిన్ ‘చెక్’, సందీప్ కిషన్ ‘ ఏ1 ఎక్స్‌ప్రెస్’ కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కినవే. అయితే ‘లక్ష్య’ ప్రత్యేకత ఏంటంటే.. పూర్తిగా విలువిద్య నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా ఇది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో పాటు తాత మనవడి సెంటిమెంట్ కూడా ఉంది. అయితే అది తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్టాప్ అంతా సింపుల్‌గా, పాత సినిమాలు చూసినట్లుగా సాగుతుంది. ఎక్కడా వావ్ అనే సీన్స్ కానీ, ట్విస్టులు కానీ ఉండవు. కథంతా ముందే తెలిసిపోతుంది. హీరో డ్రగ్స్‌కి బానిస కావడం, దానికి కారణం ఎవరై ఉంటారనేది కూడా సినిమా చూసే సగటు ప్రేక్షకుడు ఇట్టే పసిగట్టగలడు. ప్రేక్షకుడి ఊహకు అనుగుణంగా కథ సాగడం సినిమాకు మైనస్. ఇంటర్వెల్ సీన్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించదు. సెకండాప్లో జగపతి బాబు ఎంట్రీ తర్వాత కాస్త ఆసక్తి కరంగా సాగుతుంది అనుకుంటే.. అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. కథ డిమాండ్ మేరకే ఎనిమిది పలకల దేహాన్ని తయారు చేశానని ఇంటర్యూల్లో నాగశౌర్య చెప్పారు. కానీ కథకు అది ఏరకంగా అవసరమే తెరపై చూపించలేకపోయాడు. క్లైమాక్స్ సీన్స్ కూడా చప్పగా సాగుతాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ కొత్తగా ఏమీ సాగదు. ఇక కాలభైరవ సంగీతం కూడా అంతంత మాత్రమే అనే చెప్పాలి. గతంలో మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చిన కాలభైరవ లాంటి యంగ్ మ్యూజిక్ డైరక్టెర్ నుంచి దర్శకుడు మంచి సాంగ్స్‌ని రాబట్టుకోలేకపోయాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా వర్కౌట్ కాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. దర్శకుడు వదిలిన బాణం గురి తప్పింది. కలెక్షన్ల పరంగా ‘లక్ష్య’ లక్ష్యం ఏమేరకు నెరవేరుతుంతో వీకెండ్ వరకు వేచి చూడాలి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ సమయంలో తొమ్మిది రోజులు నీళ్లు కూడా ముట్టుకోలేదు: నాగశౌర్య
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగశౌర్య మీడియాతో మాట్లాడుతూ.. వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని అనుకున్నాను. కొత్త నాగ శౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశానని తెలిపారు. ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టమని. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కథ డిమాండ్ చేస్తే ఏ యాక్టర్ అయినా సిక్స్ ప్యాక్ చేస్తారు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే అందరం చాలా కష్టపడతాం. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు దాదాపు తొమ్మిది రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోలేదని’’ అన్నారు. ‘‘ 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదని ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. ఈ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే శిక్షణ తీసుకున్నాను. దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా లక్ష్య. నా కెరీర్లోనూ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాను చేయడం ఇదే మొదటి సారి. ఇది వరకు కూడా క్రీడా నేపథ్యంలోని కథలు నా వద్దకు వచ్చాయి. కానీ ఇది బాగా నచ్చిందని చెప్పారు. చదవండి: Bigg Boss Telugu 5: సిరిది సిగ్గులేని జన్మ, ఆయన కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో -
లక్ష్య కథ వినగానే భయపడ్డాను: నిర్మాత
నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘లక్ష్య’. ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► లవ్ స్టోరీ సినిమా మాకు మంచి విజయాన్ని అందించింది. కమర్షియల్గానూ పెద్ద సక్సెస్ అయింది. శేఖర్ కమ్ముల గారు మాకు ఒక మంచి సినిమాను ఇచ్చారు. ఆ సమయంలో మాకు వచ్చిన మొత్తం చాలా ఎక్కువే. వారం వారం సినిమాలు మారుతుంటాయి. ఈ వారం లక్ష్య సినిమా రాబోతోంది. ఆర్చరీ బేస్డ్ సినిమాలు ఇంత వరకు రాలేదు. ఆ పాయింట్ అందరినీ ఆకట్టుకుంది. ► మొదట ఈ కథ విన్నప్పుడు కొద్దిగా భయపడ్డాను. కానీ పూర్తిగా కథ విన్నాక చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఆటతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కథ విన్నవెంటనే నాగ శౌర్యకు పంపించాం. అతను విన్న వెంటనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ తరువాత నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ శరత్ మరార్తో కలిసి నిర్మించాం. ► రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లు, ఓవర్సీస్లో 100 థియేటర్లలో లక్ష్య సినిమాను విడుదల చేయబోతోన్నాం. ► అఖండ సినిమా పెద్ద సక్సెస్ అయింది. అది మాకు సంతోషంగా అనిపించింది. అసలు థియేటర్లకు జనాలు వస్తారా? లేరా? అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ భయాలన్నీ పోయాయి. రెండేళ్ల క్రితమే శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మేశాం. ఫిల్మ్ బాగుంటే జనాలు వస్తారు అని తెలిసింది. ఇప్పుడు మేం థియేటర్ రెవిన్యూ మీద ఆధారపడ్డాం. ► సినిమాలు చిన్నవి పెద్దవి అని కాదు. పెద్ద సినిమా అయినా బాగా లేకపోతే ఎవ్వరూ చూడటం లేదు. అదే జాతి రత్నాలు లాంటి చిన్న సినిమా బాగుంది. యాభై కోట్లు కలెక్ట్ చేసింది. ► ఆన్ లైన్ టికెటింగ్ అనేది మంచిదే. దానిపై ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే టికెట్ రేట్లు ఇబ్బందిగా ఉంది. తెలంగాణలో రేట్లు బాగున్నాయి. కానీ ఏపీలో పరిస్థితి బాగా లేదు. ఆ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. దేశం అంతా ఒక వైపు పోతోంటే మనం ఇంకో వైపు పోలేం కదా. కచ్చితంగా రేట్లు పెంచాల్సింది. మన దగ్గర ఉన్న థియేటర్లు దేశంలో ఎక్కడా లేవు. అత్యాధునిక హంగులతో థియేటర్లను నిర్మించాం. ప్రేక్షకులు కూడా అలాంటి థియేటర్లోనే సినిమాలను చూడాలని అనుకుంటారు. ► మరీ ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా రేట్లు ఉంటేనే పరిశ్రమకు మంచిదని నా అభిప్రాయం. మరీ ఎక్కువగా ఉంటే కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చు. టికెట్ రేట్లను మరీ ఇంత తక్కువగా తగ్గించడంతో నిర్మాతలకు కష్టంగా మారింది. ► శేఖర్ కమ్ముల-ధనుష్, శివ కార్తికేయన్‌తో ఒక సినిమా, సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ డైరెక్షన్లో ఒక సినిమా, రంజిత్ దర్శకత్వంలో గౌతమ్ విజయ్ సేతుపతి- సందీప్ కిషన్ల కాంబినేషన్లో మరో సినిమా.. నాగార్జునతో ఓ సినిమాను చేస్తున్నాం. ఈ సినిమాకు ముందుగా కాజల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు వేరే హీరోయిన్ను చూస్తున్నాం. ► లక్ష్య సినిమా క్రీడా నేపథ్యంలో రావడమే ప్లస్ పాయింట్. కేతిక శర్మ చాలా బాగా నటించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా వచ్చింది. ఆల్రెడీ లక్ష్యం అనే వచ్చిందనే ఉద్దేశ్యంతో లక్ష్య అనే టైటిల్‌ను పెట్టామని నిర్మాతలు చెప్పుకొచ్చారు. -
ఈ వారం అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు..
Upcoming Movies And Web Series In December Second Week: నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం విజయంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఇక్కడి నుంచి సంక్రాంతి వరకు వరుస సినిమాలు అలరించనున్నాయి. అంతకుముందు దీపావళి కానుకగా వచ్చిన బాలీవుడ్ మూవీ 'సూర్యవంశీ' మంచి వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో డిసెంబర్ రెండో వారంలో థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం. 1. లక్ష్య యంగ్ హీరో నాగశౌర్య నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘లక్ష్య’. నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ కీలక పాత్రలు పోషించగా కేతిక శర్మ హీరోయిన్. ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. విలువిద్య నేపథ్య కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు నాగశౌర్య. కాల భైరవ స్వరాలు సమకూరుస్తున్నారు. 2. గమనం శ్రియ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘గమనం’. ఈ చిత్రాన్ని సుజనారావు తెరకెక్కించారు. రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. భావోద్వేగభరితమైన మూడు కథలతో రూపొందిన చిత్రమిది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో కనిపించనుంది. 3. నయీం డైరీస్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కిన ‘నయీం డైరీస్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ ప్రధాన పాత్ర పోషించారు. సీఏ వరదరాజు నిర్మాత. 'రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయనే విషయాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం. నయీం ఎన్కౌంటర్ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యయనం చేశా. నయీం సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అతని డైరీలో పేర్కొన్న విషయాలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి. వశిష్ఠ సింహ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.' అని చిత్ర బృందం చెబుతోంది. 4. మడ్డీ డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న పాన్ ఇండియా చిత్రం 'మడ్డీ'. ఈ సినిమాలో యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ కృష్ణదాస్ నిర్మాణంలో ప్రగభల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. 'మడ్ రేసింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఐదేళ్లు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో ఫ్యామిలీ డ్రామా, వినోదం, సాహసం.. ఇలా ప్రతి ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రధాన నటులకు రోడ్ రేసింగ్‌లో రెండేళ్లు శిక్షణ ఇచ్చారు.' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు. ఇవే కాకుండా బుల్లెట్ సత్యం, ప్రియతమ, మనవూరి పాండవులు, కటారి కృష్ణ, సర్వం సిద్ధం చిత్రాలు కూడా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆహా * పుష్పక విమానం డిసెంబర్ 10 అమెజాన్ ప్రైమ్ * ద ఎక్స్పాన్స్ (వెబ్ సిరీస్ సీజన్-6) డిసెంబరు10 * ఎన్కౌంటర్ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు10 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ * ఆర్య (హిందీ వెబ్ సిరీస్ సీజన్-2) డిసెంబరు 10 నెట్‌ఫ్లిక్స్ * ద లైట్ హౌజ్ (హాలీవుడ్) డిసెంబరు 6 * వాయిర్ డిసెంబరు 6 * టైటాన్స్ (వెబ్‌సిరీస్ సీజన్-3) డిసెంబరు 8 *అరణ్యక్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 * ద అన్ ఫర్‌గివబుల్ (హాలీవుడ్) డిసెంబరు 10 జీ5 కాతిల్ హసీనోంకే నామ్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 -
అలా సిద్ధమయ్యాకే సినిమా చేస్తా: హీరో శర్వానంద్
Sharvanand Interesting Comments In Lakshya Pre Release Function: యంగ్ హీరో నాగశౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. క్రీడా నేపథ్యంతో వస్తోన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం (డిసెంబర్ 5) జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్, దర్శకుడు శేఖర్ కమ్ముల, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపించద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శర్వానంద్ 'క్రీడా నేపథ్యంతో సినిమా చేయడానికి, తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ జోనర్లో వచ్చిన సినిమాలు ఎక్కువగా విజయాల్నే అందుకున్నాయి. ఇలాంటివి చేస్తున్నప్పుడు నటుడికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. నాగశౌర్య పడిన కష్టం కనిపిస్తోంది. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక నాగశౌర్యలా సిక్స్‌ప్యాక్‌తో సిద్ధమయ్యాకే మరో సినిమా చేస్తా. అఖండ విజయం సీజన్‌కు మంచి సంకేతం. నాగశౌర్యకు మరిన్ని విజయాలు రావాలి. బాలీవుడ్‌కు కూడా వెళ్లిపోవాలి.' అని తెలిపారు. లక్ష్య సినిమా చేస్తూ ఎంతో నేర్చుకున్న అని హీరో నాగశౌర్య అన్నారు. ఏ సమస్య వచ్చినా సరే నిర్మాతలు తనకోసం నిలబడ్డారని తెలిపారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయని దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. ఆర్చరీ అనేది ప్రేక్షకులకు కొత్త, అందులోనే విజయం ఉందన్నారు. భారతీయ క్రీడా సినిమాల్లో నిలిచిపోయే మరో చిత్రం 'లక్ష్య' కావాలని కోరుకుంటున్నా అని పుల్లెల గోపించంద్ అన్నారు. 'నా తొలి సినిమా సుబ్రమణ్యపురం. తర్వాత సునీల్ నారంగ్ నన్ను పిలిచి ఈ అవకాశమిచ్చారు. ఏడున్నర గంటలు కథ విని ఈ సినిమా చేశారు నాగశౌర్య. సినిమా అనేది కళారూపం. దానికి ఆక్సిజన్ థియేటర్ వ్యవస్థ. ఆ ఆక్సిజన్ అందజేసే వ్యక్తి నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్.' అని లక్ష్య చిత్రం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాగ చైతన్య చేతుల మీదుగా ‘లక్ష్య’ మూవీ సాంగ్
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ కథ నడుస్తుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈమూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ చూసిన హీరో విక్టరి వెంకటేష్ ట్రైలర్ సినిమా విడుదలపై మరింత హైప్ క్రియేట్ చేసిందని, ఊహించిన దానికంటే సినిమా మరో లెవల్లో ఉండబోతుందంటూ మూవీ టీంపై ప్రశంసలు కురిపించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలోని పాటను యంగ్ హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్య విడుదల చేశాడు. ‘సయా సయా’ అంటూ సాగే రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను చైతన్య చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ పాటలో నాగశౌర్య-కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించగా..ఎమ్ఎమ్ కిరవాణి వారసుడు కాల భైరవా స్వరాలు సమకుర్చాడు. డిసెంబర్ 10న థియేటర్లోకి రాబోతోన్న ఈ మూవీలో జగపతిబాబు, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. Happy to launch #SayaSaya Song from #Lakshya https://t.co/BSIiz4IXTZ All the best @IamNagashaurya & team ..enjoyed the trailer ! #LakshyaOnDec10th#KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop — chaitanya akkineni (@chay_akkineni) December 4, 2021 -
రితికలాగే నేను ఉంటా.. భరించడం కష్టం :కేతికా శర్మ
పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ కేతికా శర్మ. తొలి చిత్రంతోనే తనదైన అందాలతో కుర్రకారులను కట్టిపడేసింది. అంతేకాదు తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకొని ఫుల్ బిజీ అయింది. ఈ భామ తాజాగా నటించిన చిత్రం లక్ష్య. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 10వ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కేతికా శర్మ గురువారం మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అలా ‘రొమాంటిక్’కి ఓకే చెప్పా సినిమాల కోసం ట్రై చేస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ ఆపీస్ నుంచి కాల్ వచ్చింది. అంత పెద్ద డైరెక్టర్ నుంచి కాల్ రావడంతో.. కథ వినకముందే ‘రొమాంటిక్’ మూవీకి ఓకే చెప్పా. పూరి జగన్నాథ్ కోసమే రొమాంటిక్ మూవీ చేశా. ‘రొమాంటిక్’కి పూర్తి భిన్నమైన పాత్ర కరోనా కారణంగా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా షూటింగ్ చివరి రోజు.. సంతోష్ వచ్చి ‘లక్ష్య’కథ చెప్పారు. తొలి సినిమా షూటింగ్ అదే రోజు పూర్తవ్వడం.. వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్‌లో పూర్తి గ్లామర్ రోల్ అయితే లక్ష్య సినిమాలో పూర్తిగా భిన్నంగా కనిపిస్తాను. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రితికలానే నేను కూడా ఉంటాను లక్ష్య సినిమాలో నా పాత్ర పేరు రితిక. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. తన మనసుకు ఏమనిపిస్తే అదిచేసే అమ్మాయియే రితిక. రితికలాగే నేను ఉంటాను. నా మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తా. నాలాంటి వాళ్లను భరించడం కష్టం. ఆఫర్లు వస్తున్నాయి కోలీవుడ్‌తో పాటు ఇతర లాంగ్వేజ్‌లలో ఆఫర్లు వస్తున్నాయి. కానీ యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రలనే చేయాలని నిర్ణయించుకున్నా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలనేదే నా డ్రీమ్. నాకు నచ్చింది ఇదేనని చెప్పడంతో పేరెంట్స్ ఏడాది టైమ్ ఇచ్చి, నిరూపించుకోమని చెప్పారు. అదృష్టవశాత్తు పూరి జగన్నాథ్ నుంచే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చా. ఇప్పుడు మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. -
వెస్ట్రన్ లుక్‌లో లక్ష్య హీరోయిన్ కేతిక శర్మ
-
ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ ట్రైలర్
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. చదవండి: Rajamouli Emotional Post: ‘ఆర్ఆర్ఆర్’లో ఆయనతో ఓ షాట్ ప్లాన్ చేశా, కానీ.. సృజనమణి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు .. నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు.. ఇద్దరూ ఒకటేగా’ అంటూ హీరోయిన్ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో కేతిక శర్మ కథానాయికగా నటించింది. అలాగే జగపతిబాబు, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ డిసెంబర్ 10వ థియేటర్లలో విడుదల కానుంది. -
నాగశౌర్య 'లక్ష్య' చిత్రం విడుదల ఎప్పుడో తెలుసా ?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య 20వ చిత్రం 'లక్ష్య' విడుదల తేదీని ఖరారైంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో దృఢమైన శరీరాకృతితో పోనీ టేల్‌తో వర్షంలో విల్లు, బాణాన్ని పట్టుకుని స్టైల్‌గా కనిపిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా ఆర్చరీ (విలువిద్య) క్రీడ నేపథ్యంలో రానుంది. దీంట్లో పార్థు అనే క్రీడకారుడి పాత్రలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా కోసం నాగశౌర్య భారీగా వర్క్అవుట్స్ చేసి శరీరాన్ని దృఢంగా తయారు చేసుకున్నాడు. నాగశౌర్య ఇంతకుముందు సినిమా 'వరుడు కావలెను' బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులను లక్ష్య సినిమా పూర్తి చేసుకుంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్రబృందం భారీ ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తోంది. సోనాలి నారంగ్ సమర్పించగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ శరత్ మరార్, నారయణ దాస్ కె, నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్గా కేతిక శర్మ చేస్తున్నారు. చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. -
నవంబర్ 12కి బాణం గురిపెట్టిన నాగశౌర్య
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీని నవంబర్ 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావ్, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ‘లక్ష్య’ రిలీజ్ డేట్ ఏమై ఉంటుందో గేస్ చేయండంటూ ప్రేక్షకులకి పజిల్ విసిరింది మూవీ టీం. అందులో అక్టోబర్ 15, అక్టోబర్ 22, అక్టోబర్ 29, నవంబర్ 12 తేదీలు ఉండగా, తాజాగా నవంబర్ 12ని ఖరారు చేసింది చిత్రబృందం. ఆర్చరీ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య రెండు విభిన్న పాత్రలతో అలరించనున్నాడు. అందులో సిక్స్ ప్యాక్, పోనీ టెయిల్‌తో ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తుండగా కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ యంగ్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్గా చేస్తున్న మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. చదవండి: తన ‘లక్ష్యా’న్ని పూర్తి చేసుకున్న నాగశౌర్య Finally the time is here to lift my Recurve☺️ All set to let fly my arrow on, 12th of November 🎯#Lakshya🏹#LakshyaonNov12th #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/GRJIRRF1Es — Naga Shaurya (@IamNagashaurya) September 27, 2021 -
తన ‘లక్ష్యా’న్ని పూర్తి చేసుకున్న నాగశౌర్య
నాగశౌర్య తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ లక్ష్యం ఏంటి? అనేది ‘లక్ష్య’ సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. (చదవండి: విజయకాంత్‌కు అనార్యోగం? చికిత్స కోసం అమెరికాకు..) చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘భారతదేశ ప్రాచీన విలువిద్య నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్య’. ఆసక్తికి గురి చేసే అంశాలతో వినోదభరితంగా, ఉత్కంఠగా సాగుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ రెడ్డి, సంగీతం: కాల భైరవ.