నాగ చైతన్య చేతుల మీదుగా ‘లక్ష్య’ మూవీ సాంగ్‌ | Naga Chaitanya Released Naga Shaurya Lakshya Movie Saya Saya Song | Sakshi
Sakshi News home page

Lakshya Movie Song Release: నాగ చైతన్య చేతుల మీదుగా ‘సయా సయా’ సాంగ్‌ రిలీజ్‌

Published Sat, Dec 4 2021 4:52 PM | Last Updated on Sat, Dec 4 2021 4:59 PM

Naga Chaitanya Released Naga Shaurya Lakshya Movie Saya Saya Song - Sakshi

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ కథ నడుస్తుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈమూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ ట్రైలర్‌ చూసిన హీరో విక్టరి వెంకటేష్‌ ట్రైలర్‌ సినిమా విడుదలపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసిందని,  ఊహించిన దానికంటే సినిమా మరో లెవల్‌లో ఉండబోతుందంటూ మూవీ టీంపై ప్రశంసలు కురిపించాడు. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలోని పాటను యంగ్‌ హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్య విడుదల చేశాడు. ‘సయా సయా’ అంటూ సాగే రొమాంటిక్‌ లిరికల్‌ సాంగ్‌ను చైతన్య చేతుల మీదుగా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఈ పాటలో నాగశౌర్య-కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ  బాగా కుదిరింది. కృష్ణకాంత్‌ ఈ పాటకు సాహిత్యం అందించగా..ఎమ్‌ఎమ్‌ కిరవాణి వారసుడు కాల భైరవా స్వరాలు సమకుర్చాడు. డిసెంబర్‌ 10న థియేటర్లోకి రాబోతోన్న ఈ మూవీలో జగపతిబాబు, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement