Naga Shaurya Lakshya Movie Streaming On OTT On 7th January 2022 - Sakshi
Sakshi News home page

Lakshya Movie: అప్పుడే ఓటీటీకి నాగశౌర్య లక్ష్య మూవీ

Published Fri, Dec 31 2021 2:13 PM | Last Updated on Fri, Dec 31 2021 5:56 PM

Naga Shaurya Lakshya Movie Streaming On OTT On 7th January 2022 - Sakshi

Naga Shaurya Lakshya Movie Streaming On OTT: యంగ్‌ హీరో నాగ శౌర్య, ‘రొమాంటిక్‌ మూవీ బ్యూటీ కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం లక్ష్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 10న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కిన ఈమూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం నాగశౌర్య ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అంతేగాక సిక్స్‌ ప్యాక్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రెండు విభిన్న లుక్‌లో అలరించిన నాగశౌర్య నటనకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

చదవండి: తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ రివీల్‌ చేసిన సామ్‌, షాకవుతున్న నెటిజన్లు

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోంది. మూవీ రిలీజ్‌ నెల రోజుల కూడా కాకముందే లక్ష్య డిజిటిల్‌ ప్లాట్‌ఫాంలో సందడి చేయడం విశేషం. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహాలో 2022 జనవరి 7 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాళ భైరవ సంగీతాన్ని సమకుర్చారు. 

చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న శ్యామ్‌ సింగరాయ్‌!, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement