రితికలాగే నేను ఉంటా.. భరించడం కష్టం :కేతికా శర్మ | Ketika Sharma Talk About Lakshya Movie | Sakshi
Sakshi News home page

Lakshya: రితికలాగే నేను ఉంటా.. భరించడం కష్టం :కేతికా శర్మ

Published Fri, Dec 3 2021 5:35 PM | Last Updated on Fri, Dec 3 2021 5:48 PM

Ketika Sharma Talk About Lakshya Movie - Sakshi

పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ కేతికా శర్మ. తొలి చిత్రంతోనే తనదైన అందాలతో కుర్రకారులను కట్టిపడేసింది. అంతేకాదు తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకొని ఫుల్‌ బిజీ అయింది. ఈ భామ తాజాగా నటించిన చిత్రం లక్ష్య. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌ 10వ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ కేతికా శర్మ గురువారం మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

అలా ‘రొమాంటిక్’కి ఓకే చెప్పా
సినిమాల కోసం ట్రై చేస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ ఆపీస్ నుంచి కాల్ వచ్చింది. అంత పెద్ద డైరెక్టర్‌ నుంచి కాల్‌ రావడంతో.. కథ వినకముందే ‘రొమాంటిక్‌’ మూవీకి ఓకే చెప్పా. పూరి జగన్నాథ్‌ కోసమే రొమాంటిక్‌ మూవీ చేశా. 

‘రొమాంటిక్‌’కి పూర్తి భిన్నమైన పాత్ర
కరోనా కారణంగా బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజ్‌ వచ్చాయి. రొమాంటిక్‌ సినిమా షూటింగ్‌ చివరి రోజు.. సంతోష్‌ వచ్చి ‘లక్ష్య’కథ చెప్పారు. తొలి సినిమా షూటింగ్‌ అదే రోజు పూర్తవ్వడం.. వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్‌లో పూర్తి గ్లామర్ రోల్ అయితే లక్ష్య సినిమాలో పూర్తిగా భిన్నంగా కనిపిస్తాను. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను 

రితికలానే నేను కూడా ఉంటాను
లక్ష్య సినిమాలో నా పాత్ర పేరు రితిక. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. తన మనసుకు ఏమనిపిస్తే అదిచేసే అమ్మాయియే రితిక. రితికలాగే నేను ఉంటాను. నా మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తా. నాలాంటి వాళ్లను భరించడం కష్టం.



ఆఫర్లు వస్తున్నాయి
కోలీవుడ్‌తో పాటు ఇతర లాంగ్వేజ్‌లలో ఆఫర్లు వస్తున్నాయి. కానీ యాక్టింగ్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలనే చేయాలని నిర్ణయించుకున్నా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ చేయాలనేదే నా డ్రీమ్‌. నాకు నచ్చింది ఇదేనని చెప్పడంతో పేరెంట్స్‌ ఏడాది టైమ్‌ ఇచ్చి, నిరూపించుకోమని చెప్పారు. అదృష్టవశాత్తు పూరి జగన్నాథ్‌ నుంచే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చా. ఇప్పుడు మా పేరెంట్స్‌ హ్యాపీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement