
నాగశౌర్య తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ లక్ష్యం ఏంటి? అనేది ‘లక్ష్య’ సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు.
(చదవండి: విజయకాంత్‌కు అనార్యోగం? చికిత్స కోసం అమెరికాకు..)
చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘భారతదేశ ప్రాచీన విలువిద్య నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్య’. ఆసక్తికి గురి చేసే అంశాలతో వినోదభరితంగా, ఉత్కంఠగా సాగుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్ రెడ్డి, సంగీతం: కాల భైరవ.
Comments
Please login to add a commentAdd a comment