attari-Wagah border
-
అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు
న్యూఢిల్లీ: భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు కవాతు చేశారు. ఇరు దేశాల సైనికులు ఉత్సాహంగా పరస్పరం కరచాలనం చేసుకోవడం ఆకట్టుకుంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న అట్టారీ సరిహద్దులో జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఇరు దేశాల పౌరులు హాజరయ్యారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో పాక్ రేంజర్లు, బీఎస్ఎఫ్ జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. 1959 నుంచి ప్రతి ఏటా ఇరు దేశాల సైనికులు ఈ బీటింగ్ రీట్రీట్ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పలు నృత్య ప్రదర్శనలు, గీతాలపనలు నిర్వహించారు. ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: అప్పుడు తులం బంగారం విలువ 88 రూపాయల 62 పైసలు! ఈ విషయాలు తెలుసా? -
17 నెలలు పాక్ చెరలో బందీ..
గాంధీనగర్: పాకిస్తాన్లో బందీలుగా ఉన్న భారతీయ జాలర్లను విడిపించేందుకు భారత విదేశాంగశాఖ చేసిన ప్రయత్నలు ఫలించాయి. పాకిస్తాన్‌ను నుంచి ఈనెల 8న విడుదలైన 100 భారత జాలర్లు శుక్రవారం మాతృభూమిపై అడుగుపెట్టారు. వాఘా సరిహద్దులో దేశంలోకి ప్రవేశించిన వారు గురువారం అర్థరాత్రి అనంతరం వడోదర చేరుకున్నారు. గుజరాత్‌కు చెందిన జాలర్లు 17 నెలల క్రితం చేపలు పడుతూ అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటి పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లారు. దీంతో 100 మంది జాలర్లను పాక్ గస్తీ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారందరినీ కరాచీ జైలులో నిర్భందించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ పలు దఫాలుగా పాక్ ప్రభుత్వంతో చర్చించింది. ఏడాదిన్నర కాలం తర్వాత జాలర్లను జైలు నుంచి విడుదల చేసిన పాక్.. ఈ నెల 8న అట్టారీ -వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించింది. అక్కడ్నుంచి అమృత్సర్ మీదుగా వడోదరకు రైలులో జాలర్లను తీసుకువచ్చారు. జాలర్ల విడుదలపై వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. తమను ఒక గదిలో బంధించారని, వేరే చోటకు వెళ్లేందుకు అనుమతించలేదని ఓ జాలర్ వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించాలనే ఉద్దేశంతో.. 360 మంది భారత ఖైదీలను విడుదల చేస్తామని ఏప్రిల్ 5వ తేదీన పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు విడతల్లో అందరినీ విడుదల చేస్తామని పాక్ ప్రకటించింది. -
వాఘా సరిహద్దులో రిట్రీట్ రద్దు
ఛండీఘర్: పంజాబ్ రాష్ట్రంలోని వాఘా సరిహద్దులో గురువారం జరగాల్సిన బీటింగ్ రిట్రీట్ రద్దు అయింది. ఎల్వోసీ వద్ద ఉద్రిక్తల నేపథ్యంలో అట్టారి-వాఘా బోర్డర్ వద్ద జరిగే రిట్రీట్ను బీఎస్ఎఫ్ రద్దు చేసింది. ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరుగుతుంది. 1959 నుండి ఈ ఆనవాయితీ ఉన్నది. అరగంటపాటు జరిగే ఈ రీట్రీట్‌ను వీక్షించేందుకు ఇరు దేశాల నుంచి వందలాంది మంది వస్తుంటారు. ఇక్కడకు వచ్చే ప్రతి వారూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తారు. అయితే అట్టావా నుంచి రిట్రీట్‌కు వెళ్లేందుకు పర్యాటకులతో పాటు సందర్శకులు ఆసక్తి చూపనట్లు సమాచారం. అయితే రిట్రీట్ను ఎందుకు రద్దు చేశారో తమకు స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.