
పాక్ వైపు నుంచి వచ్చిపడుతున్న మోర్టార్ షెల్స్
శ్రీనగర్ : దాయాది పాకిస్తాన్ మళ్లీ బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు వెంబడి ఘాతుకానికి తెగబడింది. గ్రామాలపై బుల్లెట్లు, మోర్టార్‌షెల్స్ వర్షం కురిపించింది. కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. జమ్ముకశ్మీర్ ఫూంచ్ సెక్టార్ బాల్‌కోట్ సరిహద్దుపైకి పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయని అధికారులు చెప్పారు. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పేర్కొన్నారు.