pakistan forces
-
భారతీయుల్ని కాల్చిచంపిన పాక్
-
భారతీయుల్ని కాల్చిచంపిన పాక్
శ్రీనగర్ : దాయాది పాకిస్తాన్ మళ్లీ బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు వెంబడి ఘాతుకానికి తెగబడింది. గ్రామాలపై బుల్లెట్లు, మోర్టార్షెల్స్ వర్షం కురిపించింది. కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. జమ్ముకశ్మీర్ ఫూంచ్ సెక్టార్ బాల్కోట్ సరిహద్దుపైకి పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయని అధికారులు చెప్పారు. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పేర్కొన్నారు. -
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన:భారత జవాన్ మృతి
జమ్మూకాశ్మీర్: భారత్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన పిదప పొరుగుదేశం పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రరణ రేఖ(ఎల్ఓసీ) వద్ద పాక్ భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజాము ప్రాంతంలో కాల్పులు జరిపాయి. పాక్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో భారత్ సరిహద్దులోకి చేరుకుని కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భారత్ కూడా ఎదురుదాడి దిగింది. ఈ ఘటనలో ఒక భారత్ జవాన్ తో పాటు, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైయ్యాయి. 2003లో భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చేసుకున్న కాల్పుల ఒప్పందాన్ని ఈ ఏడాది మొదటి నుంచి పాక్ తరచుగా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల సరిహద్దుల వెంబడి కాల్పులు జరగకుండా ఉండేందుకు కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.