జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు వద్ద కవ్వింపులకు దిగింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాల్లో భారత్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగింది.
ఎల్ ఓసీ వద్ద సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలకోట్ సెక్టార్ లో పాకిస్థాన్ బలగాలు కవ్వింపు కాల్పులకు దిగాయని రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పాక్ కాల్పులకు భారత సైనికులు దీటుగా స్పందించారని వెల్లడించారు. 8.10 గంటలకు వరకు కాల్పులు కొనసాగాయి. ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు.
కవ్వింపులకు దిగిన పాకిస్థాన్
Published Mon, Dec 8 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement
Advertisement