unprovoked firing
-
కాల్పుల ఒప్పందానికి పాక్ తూట్లు
శ్రీనగర్: పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జమ్మూలోని పూంఛ్ సెక్టార్లో బుధవారం ఉదయం పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు వారికి ధీటైన జవాబిస్తున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గత నాలుగు రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీ మూడు సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించింది. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులమోత
-
కవ్వింపులకు దిగిన పాకిస్థాన్
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు వద్ద కవ్వింపులకు దిగింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాల్లో భారత్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగింది. ఎల్ ఓసీ వద్ద సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలకోట్ సెక్టార్ లో పాకిస్థాన్ బలగాలు కవ్వింపు కాల్పులకు దిగాయని రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పాక్ కాల్పులకు భారత సైనికులు దీటుగా స్పందించారని వెల్లడించారు. 8.10 గంటలకు వరకు కాల్పులు కొనసాగాయి. ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు.