ఏ ఉగ్రవాది అయినా సరే.. జమ్ము కాశ్మీర్ వద్ద నియంత్రణ రేఖను దాటి వచ్చాడంటే వెంటనే కాల్చిపారేస్తామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించి నియంత్రణ రేఖ వద్ద ఓ పౌరుడిపై కాల్పులు జరిపిందంటూ పాకిస్థానీ మీడియా గోల పెట్టడంతో ఆయనీ ప్రకటన చేశారు. 'ఎల్ఓసీని దాటి వచ్చే ఏ ఉగ్రవాదిమీద అయినా కాల్పులు జరిపి తీరుతాం' అని ఆయన స్పష్టం చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరుపక్షాలూ గౌరవించేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నామే గానీ పెంచి పోషించాలని మాత్రం అనుకోవడం లేదని అన్నారు. పొరుగువారు నిబంధనలు పాటిస్తే తాము కూడా పాటిస్తామని, వాళ్లు ఉల్లంఘిస్తే తాము కూడా ఉల్లంఘించి తీరుతామని విక్రమ్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల రాకను అడ్డుకోడానికే తాము కాల్పులు జరుపుతున్నాం తప్ప పౌరుల మీద కాదని జనరల్ అన్నారు. డిసెంబర్ నెలలో ఇరుదేశాల డీజీఎంఓల సమావేశం తర్వాతి నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘనలు గణనీయంగా తగ్గాయన్నారు.
సరిహద్దు దాటి వస్తే కాల్చిపారేస్తాం: ఆర్మీ చీఫ్
Published Mon, Jan 13 2014 2:56 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement